Jayam Movie Child Actress: బాలనటులుగా నటించిన ఎంతో మంది ఆర్టిస్టులు నేడు స్టార్స్ గా, సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్నారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు(Superstar Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), తరుణ్, రాశి ఇలా ఒక్కరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. చిన్నతనం లో ఇంద్ర లాంటి సూపర్ హిట్ లో బాలనటుడిగా నటించిన తేజ సజ్జ కూడా నేడు ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయాడు. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ సినిమాల్లోకి మాత్రం రాలేదు. వీళ్లకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి, వీళ్ళు గతం లో పలానా చిత్రం చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు గుర్తుందా? వంటి పోస్టులు చూసి ఆశ్చర్యపోతున్నారు. నేడు మనం అలాంటి చైల్డ్ ఆర్టిస్టు గురించే మాట్లాడుకోబోతున్నాము.
Also Read: కూలీ’ లో నాగార్జున క్యారక్టర్ ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?
ఆమె మరెవరో కాదు యామిని శ్వేతా నాయుడు(Yamini Swathi Naidu). నితిన్(Actor Nithin) మొదటి చిత్రం ‘జయం’ లో ఈమె హీరోయిన్ సదా చిన్నప్పటి క్యారక్టర్ లో నటించింది. జయం చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి దాదాపుగా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. కొన్ని సెంటర్స్ లో ఈ చిత్రం సంవత్సరం కి పైగా రన్ అయ్యాయి కూడా. అయితే ఈ చిత్రం చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన యామిని శ్వేతా నాయుడు కి అప్పట్లో మంచి గుర్తింపు లభించింది. ఆమెది చిన్న క్యారక్టర్ కాదు అనేది మనకి తెలిసిందే. సినిమాలో ఆమె పాత్ర దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యాక ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
Also Read: కూలీ మూవీ.. నాగార్జునే నిలబెట్టాడా? ట్రెండ్ అలానే ఉంది…
అయితే ఈమె పెరిగి పెద్దయ్యాక సినిమాల్లో వస్తుందేమో అనుకున్నారు కానీ, అలాంటిదేమి జరగలేదు. సంతోషం ఫిలిం అవార్డ్స్ లో ఒకసారి కనిపించి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. సినిమాల్లోకి అయితే రాలేదు కానీ సోషల్ మీడియా లో మాత్రం ఎంట్రీ ఇచ్చింది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ, ప్రతీ రోజు తన జీవితం లో జరిగే సంగటనలు స్టోరిలలో పెడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈమెకు పెళ్లి కూడా అయిపోయింది , ఒక పాప కూడా ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ కి సంబంధించిన లింక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము, మీ కళ్ళతో ఆమె ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి.