Junior NTR : ఈ ఏడాది ‘కల్కి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి వసూళ్లను రాబట్టే సినిమా తొందరగా రాదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ‘దేవర’ చిత్రం తో జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్స్ స్థాయి నుండే భారీ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది ‘కల్కి’ చిత్రం తర్వాత ఇండియన్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లను మొదటి రోజు రాబట్టిన సినిమా ‘దేవర’ నే అని చెప్పొచ్చు. ‘కల్కి’ చిత్రం తర్వాత తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైం’ మొదటి రోజు దాదాపుగా 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
‘దేవర’ చిత్రం దానికంటే 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని అదనంగా రాబట్టడం విశేషం. అయితే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైం’ చిత్రం తర్వాత తమిళం లో విడుదలయ్యే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రం కచ్చితంగా ‘దేవర’ ఓపెనింగ్ రికార్డ్స్ ని కొడుతుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్మాయి. ఎందుకంటే ఈ సినిమాలోని రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగానే దుమ్ము లేపే గ్రాస్ వసూళ్లు వస్తాయని అంతా ఆశించారు. కానీ అనుకున్నట్టుగా ఏమి జరగడం లేదు, నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు, తమిళ రాష్ట్రాల్లో బుక్ మై షో, పేటీఎం యాప్స్ లలో ప్రారంభించారు.
బుకింగ్స్ ప్రస్తుతానికి అనుకున్న స్థాయిలో లేవు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని చూస్తుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అసాధ్యం అని అనిపిస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ నుండి వచ్చాయి. దేవర చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండే 2.5 మిలియన్ డాలర్స్ వచ్చాయి. దీనిని బట్టి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే ‘వెట్టియాన్’ చిత్రానికి మొదటి రోజు కేవలం 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అది కూడా టాక్ పాజిటివ్ గా వస్తేనే, నెగటివ్ టాక్ వస్తే ఇంకా తక్కువ వసూళ్లు రావొచ్చు. 75 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే ‘దేవర’ మొదటి రోజు వసూళ్ళలో సగం అన్నమాట. రజనీకాంత్ కి ఎన్టీఆర్ కంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.