Rajini kanth : టాలీవుడ్ లో రజినీకాంత్ మార్కెట్ ఇంతలా పడిపోయిందా..? ‘వెట్టియాన్’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!

టాలీవుడ్ లో రజినీకాంత్ కి పూర్వ వైభవం వచ్చేసింది, మళ్ళీ ఆయన డామినేషన్ ఇక్కడ కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ జైలర్ తర్వాత విడుదలైన 'లాల్ సలాం' చిత్రం తెలుగులో కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో ట్రేడ్ రజినీకాంత్ టాలీవుడ్ మార్కెట్ పై నమ్మకం చూపలేకపోయింది

Written By: Vicky, Updated On : October 7, 2024 6:43 pm

Rajini kanth

Follow us on

Rajini kanth :  మన టాలీవుడ్ హీరోలతో సరిసమైనమైన మార్కెట్ ఉన్న తమిళ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే. ఆయన హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి తమిళం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా తెలుగు,తమిళం, మలయాళం, హిందీ వంటి ప్రాంతీయ బాషలలో రజినీకాంత్ మార్కెట్ దశాబ్దాల నుండి చెక్కు చెదరకుండా ఉండేది. కానీ ఇటీవల కాలం లో కొన్ని ఫ్లాప్స్ కారణంగా రజినీకాంత్ ఇమేజ్ భారీ గా పడిపోయింది. ముఖ్యంగా మన టాలీవుడ్ లో ఆయన మార్కెట్ పూర్తిగా కోల్పోయినట్టే అని చెప్పాలి. అయితే గత ఏడాది విడుదలైన ‘జైలర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళం తో పాటు తెలుగు లో కూడా ఈ సినిమాకి కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

దీంతో టాలీవుడ్ లో రజినీకాంత్ కి పూర్వ వైభవం వచ్చేసింది, మళ్ళీ ఆయన డామినేషన్ ఇక్కడ కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ జైలర్ తర్వాత విడుదలైన ‘లాల్ సలాం’ చిత్రం తెలుగులో కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో ట్రేడ్ రజినీకాంత్ టాలీవుడ్ మార్కెట్ పై నమ్మకం చూపలేకపోయింది అనడానికి మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వెట్టియాన్’ చిత్రం ఒక ఉదాహరణ. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 9 కోట్ల రూపాయలకే జరిగిందట. రజినీకాంత్ కెరీర్ లోనే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కబాలి’ చిత్రానికి తెలుగులో దాదాపుగా 45 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇప్పుడు ఆయన రేంజ్ 45 కోట్ల నుండి 9 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇదే ఇప్పుడు ఆయన అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న విషయం. అయితే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అంత తక్కువ జరగడానికి కూడా ఒక కారణం ఉందట. దర్శక నిర్మాతలు చాలా పొగరుతో ఈ సినిమాకి తెలుగు టైటిల్ పెట్టకుండా, నేరుగా తమిళ టైటిల్ ని పెట్టడం వల్ల మన ఆడియన్స్ లో హైప్ ఏర్పడలేదని, అసలు 9 కోట్లు కూడా చాలా ఎక్కువని అంటున్నారు. ‘వెట్టియాన్’ అంటే అర్థం ‘వేటగాడు’ అని..మరి అదే టైటిల్ ని పెట్టొచ్చు కదా అని దర్శక నిర్మాతలను విలేఖరులు అడగగా, అది ట్రెండీ గా లేదని, ఏ టైటిల్ పెట్టాలో అర్థం కాక తమిళ టైటిల్ ని ఉంచేశాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తాయని, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.