Mahesh Babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం గత కొంతకాలంగా సరికొత్త లుక్ లోకి మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన పొడవాటి జుట్టు, గుబురు గడ్డం ని పెంచి హాలీవుడ్ హీరో ని తలపించాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో చేసారు. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటి వరకు బయటకి రాలేదు. అభిమానులు మహేష్ లేటెస్ట్ లుక్ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి చిన్న ఫోటో కూడా బయటకి వదిలేందుకు ఒప్పుకోలేదు. అయితే నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక యాడ్ షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొనగా, ఆయనకీ సంబంధించిన లుక్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
పొడవాటి జుట్టుతో ఇంతకు ముందు ఎన్నడూ లేని మేక్ ఓవర్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. మహేష్ తో ఈ యాడ్ లో తమన్నా కూడా నటించింది. త్వరలోనే ఈ యాడ్ ఎడిటింగ్ మరియు ఫైనల్ మిక్సింగ్ ని పూర్తి చేసుకొని టీవీ లలో టెలికాస్ట్ కానుంది. ఇకపోతే పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత మహేష్ బాబు లేకుండా, మిగిలిన నటీనటులతో రాజమౌళి వరుసగా మూడు రోజుల పాటు షూటింగ్ ని జరిపినట్టు తెలుస్తుంది. ఉగాది రోజున ఈ షూటింగ్ సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. గతంలో #RRR మూవీ షూటింగ్ సమయంలో కూడా ఉగాది రోజున ఇలాగే మోషన్ పోస్టర్ వీడియో ని విడుదల చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి వీడియో నే ఈసారి కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఏమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా విలన్ గా ప్రముఖ మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఎంపిక అయ్యాడట. అక్కినేని నాగార్జున ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి తండ్రిగా నటించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. తన ప్రతీ సినిమా ప్రారంభోత్సవం లో స్టోరీ ఎలా ఉండబోతుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది?, ఎవరెవరు తన సినిమాలో నటించబోతున్నారు?, ఎవరెవరు పని చేయబోతున్నారు అనేది స్పష్టమైన క్లారిటీ తో చెప్పే రాజమౌళి, ఈ సినిమా మొదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు ఇంత మౌనం గా ఉన్నాడు అనేది అభిమానుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పని చేయబోతున్నారు.