Pushpa 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న మన హీరోలు ఇండస్ట్రీ హిట్ కొట్టి పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోలుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు…
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా పెను రికార్డులను సృష్టించి ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన విజయాలు ఒకత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈనెల 17వ తేదీన ఈ సినిమాకు అదనంగా మరొక 20 నిమిషాల నిడివి తో కూడిన కొన్ని సీన్లను ఆడ్ చేసి మరోసారి రిలీజ్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ రీలోడ్ వెర్షన్ తో రెండు వేల కోట్లకు పైన వసూళ్లను రాబడుతుందంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. మరి అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. తద్వారా అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ రాబోతుందనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఈ సినిమా రెండు వేల కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడితే ఇండియాలో ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్డు క్రియేట్ చేసిన సినిమాగా పుష్ప 2 నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో అజయ్ కూతురిగా నటించిన ‘పావని కరణం’ అనే అమ్మాయి నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ను ‘చిన్నాయన చిన్నాయన’ అంటూ పిల్చుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ఏజ్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఏజ్ 39 సంవత్సరాలుగా ఉంది. రష్మిక మందాన ను పిన్నమ్మ పిన్నమ్మ అంటుంది. అయితే రష్మిక ఏజ్ 28 ఇయర్స్…
ఇక ఇది చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు… ఇక పావని కరణం ఏజ్ దాదాపు అల్లు అర్జున్ తో సమానంగా ఉంది అంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమకి వచ్చిన క్యారెక్టర్ ని బాగా చేసి మెప్పించడం వరకే ఆర్టిస్టుల యొక్క గొప్పతనం ఉంటుంది.
కాబట్టి తను ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి నటించి మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆమె కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా దాంతో ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమాలు చేసే ఆఫర్లైతే వస్తున్నట్లుగా తెలుస్తోంది…