Mahesh Babu: హాలీవుడ్ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు..డిసెంబర్ 20 న ఫ్యాన్స్ కి పండగే!

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ లేటెస్ట్ గా 'ముసఫా : ది లయన్ కింగ్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 20 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా అన్ని భాషల్లో విడుదల కాబోతుంది.

Written By: Vicky, Updated On : August 21, 2024 1:52 pm

Mahesh Babu(11)

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ని క్రేజ్ ని ప్రముఖ సంస్థలు ఏ స్థాయిలో ఉపయోగించుకుంటున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. యాడ్ వరల్డ్ లో ఇప్పటికీ మహేష్ బాబు ని మించిన కింగ్ మరొకరు లేరు. అంతే కాదు మహేష్ బాబు ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నో మనం చూసాము. తనతో సరిసమానమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలకు కూడా ఆయన వాయిస్ ఓవర్ అందించాడు. ఆ సినిమాలు సక్సెస్ అవ్వడంలో మహేష్ వాయిస్ ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు మహేష్ వాయిస్ ఓవర్ ని హాలీవుడ్ సినీ నిర్మాతలు కూడా వాడుకోడానికి ముందుకు వచ్చారు.

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ లేటెస్ట్ గా ‘ముసఫా : ది లయన్ కింగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 20 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా డిస్నీ సంస్థ వారు రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు ని కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ‘ముసఫా’ పాత్రకి మహేష్ బాబు తన గాత్రాన్ని ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరారు. దీనికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈనెల 26 వ తేదీన తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాబోతుంది. అందులో మనం మహేష్ బాబు వాయిస్ ని వినొచ్చు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ‘ డిస్నీ సంస్థ అంటే నాకు ఎంతో గౌరవం. ఆ సంస్థతో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. తన కొడుకుని సరైన మార్గం లో నడిపించే ముసఫా, అడవికి ఒక గొప్ప రాజుగా కూడా ఆకర్షిస్తాడు. ఈ చిత్రం కోసం అందరూ ఎంతలా ఎదురు చూస్తున్నారో, నేను కూడా అంతలా ఎదురుచూస్తున్నాను. డిసెంబర్ 20 వ తారీఖున నా కుటుంబం తో కలిసి అభిమానులతో ఈ సినిమాని థియేటర్ లో చూస్తాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

2019 వ సంవత్సరం లో విడుదలైన ‘లయన్ కింగ్’ చిత్రానికి ఇది సీక్వెల్. లయన్ కింగ్ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.6 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరో పక్క ఈ చిత్రం విడుదలయ్యే రోజే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా విడుదల కాబోతుండడం మరో విశేషం.