https://oktelugu.com/

America : అమెరికాలోనూ పేదరికం, దుర్భర దారిద్ర్యం… ఈ వీడియోనే సాక్ష్యం

 అంతెత్తున కనిపించే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ . ఆకాశాన్ని తాకే వరల్డ్ ట్రేడ్ సెంటర్.. ప్రపంచానికే కొత్త దారి చూపించే వాషింగ్టన్ డిసి.. పాలరాతి సోయగంతో అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్.. అమెరికా అంటే ఇవే గుర్తుకొస్తాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 21, 2024 / 01:40 PM IST

    poverty in America

    Follow us on

    America :ఈ కాలంలో కూడా చాలామందికి అమెరికా వెళ్లాలనేది ఒక కల. అక్కడ చదువుకుంటూ.. కలల కొలువు చేసుకుంటూ.. ఆకర్షణీయమైన వేతనంతో.. అధునాతన సౌకర్యాలతో బతకాలనేది చాలామంది కోరిక. అందుకే అమెరికా అంటే చాలు చాలామంది ఎగిరి గంతేస్తారు. అక్కడ నచ్చినట్టు బతకాలని.. శని, ఆదివారాలు స్వేచ్ఛవిహంగల్లా జీవించాలని భావిస్తుంటారు. అందుకోసమే అక్కడికి వెళ్ళేందుకు ఎంత కష్టమైనా పడతారు. అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ.. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. ఇక మన సినిమాల్లోనూ అమెరికా గురించి గొప్పగా చూపిస్తుంటారు. అక్కడి విశాలమైన రోడ్లు, విస్తారమైన భవనాలు, పెద్దపెద్ద కంపెనీలు, అమెరికా అంటే అభివృద్ధికి కొలమానంగా.. విశిష్టమైన సంస్కృతికి నిదర్శనంగా చెబుతుంటారు. నిజంగానే అమెరికా గొప్ప దేశమేనా.. అక్కడ పేదరికం లేదా.. అంటే అమెరికాను గొప్పగా చూపిస్తున్న దేశమని.. పేదరికాన్ని దాస్తున్న దేశమని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనం గా నిలుస్తోంది.

    ఇన్ స్టా గ్రామ్ లో సర్కులేట్ అవుతున్న వీడియో ప్రకారం.. అమెరికాలోని చికాగో నుంచి మొదలు పెడితే న్యూజెర్సీ వరకు రోడ్డు పక్కన గుడారాల వేసుకొని చాలామంది జీవిస్తున్నారు. కొంతమంది వంతెనల కింద సేద తీరుతున్నారు. వారంతా కూడా మాసిన గడ్డం, పెరిగిన జుట్టు, చిరిగిన దుస్తులతో కనిపిస్తున్నారు. కొందరైతే మురికి కాలువల మధ్య జీవిస్తున్నారు. అయితే ఈ దృశ్యాలు మొత్తం కూడా ఇంతవరకు ఏ మీడియా చూపించలేదు.. అమెరికా కూడా చూపించదలచుకోలేదు. ప్రపంచ బ్యాంకుకు అత్యధికంగా బాకీ ఉన్న దేశాలలో అమెరికా ముందు ఉంటుంది. పైగా ఎక్కువగా అప్పు ఉన్న దేశాల్లోనూ అమెరికాకే ప్రథమ స్థానం ఉంటుంది. అదే అలాంటి దేశం తాము అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటుంది గాని.. అక్కడ కూడా పేదరికం ఉంది. దుర్భర దారిద్రం ఉంది. చెప్పుకోలేని అవస్థలు ఉన్నాయి. భరించలేని ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. కాకపోతే అమెరికా ప్రభుత్వ పెద్దలు వేసే బొక్కల కోసం మీడియా ఇలాంటివి చూపించదు. ఇతర దేశాల మీద అంతటి గొంతు వేసుకొని అరిచే న్యూయార్క్ టైమ్స్, ది టైమ్స్ వంటి మీడియా హౌస్ లు ప్రచురించవు, ఆ దృశ్యాలను చూపించవు.. ఎందుకంటే అలాంటివి తమ దేశ పరపతిని తగ్గిస్తాయని అవి భావిస్తుంటాయి. అదే ఇతర దేశాల వైతే భూతద్దంలో పెట్టి మరి చూపిస్తాయి. కానీ సోషల్ మీడియా అలా కాదు కదా.. ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది.. అసలు విషయాన్ని బయటపెడుతుంది. అయినా నేటి కాలంలో మీడియాకు ఉన్న విశ్వసనీయత ఎంత? అమెరికాకు ఉన్న ప్రాబల్యం ఎంత? ఏదైనా కాలానుగుణంగా మార్పు చెందాల్సిందే.