Mahesh launched MegaStar’s Title : మెగాస్టార్ ‘భోళా శంకర్’ను లాంచ్ చేసిన మహేష్ బాబు !

Mahesh launched MegaStar’s Title: టాలెంట్ ఉన్న లక్ లేని దర్శకుడు మెహ‌ర్ రమేష్ ప్రస్తుతం తన లైఫ్ పెట్టి మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఎనౌన్స్ చేయడం విశేషం. ‘భోళా శంకర్’ (Bholaa Shankar) అని ఈ సినిమాకి టైటిల్ పెట్టారు. మెగాస్టార్ కి శంకర్ అనే పేరుకు ప్రత్యేక అనుబంధం […]

Written By: admin, Updated On : August 22, 2021 10:52 am
Follow us on

Mahesh launched MegaStar’s Title: టాలెంట్ ఉన్న లక్ లేని దర్శకుడు మెహ‌ర్ రమేష్ ప్రస్తుతం తన లైఫ్ పెట్టి మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఎనౌన్స్ చేయడం విశేషం. ‘భోళా శంకర్’ (Bholaa Shankar) అని ఈ సినిమాకి టైటిల్ పెట్టారు. మెగాస్టార్ కి శంకర్ అనే పేరుకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే, చిరుకి నచ్చిన పేరునే ఈ సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారు.

ఇక మెహ‌ర్ ర‌మేష్ చేసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కి బాగా నచ్చింది. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ చాలా బాగా పట్టుకున్నాడని మెగాస్టార్ మెచ్చుకున్నారట. నిజానికి మెహర్ రమేష్ సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. డైరెక్షన్ ఛాన్స్ మర్చిపోయే సమయంలో మెగాస్టార్ పెద్ద మనసుతో పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.

గతంలో ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల‌తో మెహర్ రమేష్ భారీ చిత్రాలను చేసినా.. కెరీర్ లో ఒక్క హిట్ ను కూడా కొట్టలేకపోయాడు. ఈ సారి మాత్రం ఎలాగైనా మెగాస్టార్ తో హిట్ కొట్టాలనే కసితో ‘భోళా శంకర్'(Bholaa Shankar) కోసం మెహర్ రమేష్ పని చేస్తున్నాడు. మరి మెహర్ రమేష్, నిజంగానే మెగాస్టార్ కి పెద్ద క‌మ‌ర్శియ సక్సెస్ ఇచ్చి, తనకు ఉన్న బ్యాడ్ నేమ్ ను పొగిట్టుకోవాలని ఆశిద్దాం.

ఎందుకంటే, ఒక డైరెక్టర్ గా మెహర్ రమేష్ లో గొప్ప టాలెంట్ ఉంది. షార్ప్ కటింగ్ షాట్ మేకింగ్ లో మెహర్ రమేష్ దిట్ట. ఇక హీరోని స్టైలిష్ గా చూపించడంలో కూడా మెహర్ రమేష్ కి తిరుగులేదు. కాకపోతే కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో మెహర్ రమేష్ కెరీర్ కి పెద్ద బ్రేక్ పడింది. ఈ సారి చేయబోయే ‘భోళా శంకర్’ సినిమాతోనైనా మెహ‌ర్ రమేష్ లైఫ్ ఛేంజ్ అవుతుందేమో చూడాలి.

ఎలాగూ మెగాస్టార్ లైఫ్ చేంజింగ్ ఆఫ‌ర్ ఇచ్చారు కాబట్టి.. లైఫ్ ఛేంజ్ అయ్యే అవకాశమే ఎక్కువ. అన్నట్టు ఈ సినిమా కోసం మెహర్ రమేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టార్గెట్ చేశాడు. ఈ సినిమాలో అద్భుతమైన సిస్టర్ సెంటిమెంట్ ను పెట్టాడట. ఇక చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది.