ప్రస్తుతం బూస్టర్ డోస్ పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. బూస్టర్ డోస్ పై ప్రస్తుతం భారత్ లో అవసరమైన డేటా లేదని, అయితే వచ్చే ఏడాది మొదట్లో సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. యూఎస్, యూకే, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు మహమ్మారిపై పోరాడేందుకు ప్రజలకు బూస్టర్ డోసులు వేయాలని ఆలోచిస్తున్నాయని తెలిపారు. భారత్ లో డేటా బూస్టర్ డోస్ అవసరమని చెప్పడానికి ప్రస్తుతం తమ వద్ద తగినంత డేటా లేదని, వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి డేటా ఉండాలన్నారు. ఇందుకు పరిశోధన అవసరమని, దీనికి మరికొద్ది నెలల సమయం పడుతుందన్నారు.