https://oktelugu.com/

Dil Raju: తన మొద‌టి భార్య అనిత‌తో దిల్ రాజుకు ఆ విష‌యంలో గొడ‌వ‌లు జరిగేవి !

Dil Raju: ఒక సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు.. తనకు భవిష్యత్తులో పోటీ రావొచ్చు అనే అనుమానం ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే, దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. కొన్నేళ్ల క్రితం అనిత హఠాత్తుగా మరణించారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2022 / 04:02 PM IST
    Follow us on

    Dil Raju: ఒక సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు.. తనకు భవిష్యత్తులో పోటీ రావొచ్చు అనే అనుమానం ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే, దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత.

    Dil Raju

    కొన్నేళ్ల క్రితం అనిత హఠాత్తుగా మరణించారు. దాంతో, దిల్ రాజు.. లాక్ డౌన్ సమయంలో రెండో పెళ్ళి చేసుకున్నారు. కూతురు, పెద్దల సలహాతో తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయమున్న వైఘా రెడ్డి (తేజస్విని)ని పెళ్ళి చేసుకున్నారు. అయితే, దిల్ రాజు బ్యాన‌ర్లో స‌మ‌ర్ప‌కురాలిగా మొదటి భార్య పేరు అనిత ఉంటుంది.

    దిల్ రాజు కాచీగూడ‌లో ఉండే న‌ర‌సింహామూర్తి అనే సిద్ధాంతిని బాగా న‌మ్ముతారు. తన బ్యానర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పెట్టిన‌ సమయంలో అనిత పేరు వ‌చ్చేలా పెట్టుకోండి.. బాగా క‌లిసి వ‌స్తుంద‌ని న‌ర‌సింహామూర్తి చెప్పారు. దాంతో దిల్ రాజు, అనిత‌ను స‌మ‌ర్పకురాలిగా త‌న బ్యాన‌ర్ ముందు వేశారు. అలాగే వేస్తూ ఉన్నారు.

    Also Read: Mahesh Babu For Acharya: ‘ఆచార్య’కి మహేష్ మాట సాయం.. ఇక తెలుగు నెల దద్దరిల్లిపోద్ది

    కాగా దిల్ రాజు తన మొద‌టి భార్య‌తో తనకున్న అనుబంధం గురించి పలుసార్లు చెప్పి భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ఐతే రాజు వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న రోజులు అవి. ఆ స‌మ‌యంలో అనిత.. ముందు త‌న పేరు స‌మ‌ర్పకురాలిగా వేయడం వల్లే మీకు హిట్లు వస్తున్నాయి అని దిల్ రాజుతో సరదాగా గొడవ పడేవారట.

    Dil Raju, Anitha

    ఆ మాటకు దిల్ రాజు.. ‘అంటే నేను స్క్రిఫ్ట్‌లు జ‌డ్జ్ చేయ‌కుండా.. నేను క‌ష్ట‌ప‌డ‌కుండానే నాకు హిట్లు వస్తున్నాయా? అని స‌ర‌దాగా దిల్ రాజు కూడా ఆమెతో గొడ‌వ ప‌డేవార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇక దిల్ రాజు తాను సినిమాలు, షూటింగ్‌ల‌తో ఎంత బిజీ ఉన్నా .. విదేశాల్లో షూటింగ్‌లు జ‌రుగుతున్న‌ప్పుడు అనిత‌ను కూడా తీసుకువెళ్లివాడు అట.

    Also Read: Naga Chaitanya Samantha:నాగ చైతన్య ని మర్చిపోలేకపోతున్న సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

    Recommended Videos:

    Tags