‘Mosagallaku Mosagadu’ Completes 50 Years : ఎన్నో కష్టనష్టాలను ఓర్చి చివరకు హిట్ కొట్టాడు

తెలుగు సినిమాకి మొదటి కౌబాయ్‌ అంటే… నేటి తరం ప్రేక్షకులు కూడా టక్కున చెప్పే పేరు ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’ది. పైగా కృష్ణ మొదటి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’(‘Mosagallaku Mosagadu’). ఈ చిత్రం విడుదలై రేపటికి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఏభై ఏళ్ళు అంటే.. రెండు తరాలు.. ఈ సినిమాలో నటించిన ఎందరో అప్పటి నటీనటులు ఇప్పుడు లేరు. కానీ ఈ సినిమా సంగతులు సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna), ఈ సినిమాలో విలన్‌ […]

Written By: admin, Updated On : August 26, 2021 2:32 pm
Follow us on

తెలుగు సినిమాకి మొదటి కౌబాయ్‌ అంటే… నేటి తరం ప్రేక్షకులు కూడా టక్కున చెప్పే పేరు ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’ది. పైగా కృష్ణ మొదటి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’(‘Mosagallaku Mosagadu’). ఈ చిత్రం విడుదలై రేపటికి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఏభై ఏళ్ళు అంటే.. రెండు తరాలు.. ఈ సినిమాలో నటించిన ఎందరో అప్పటి నటీనటులు ఇప్పుడు లేరు. కానీ ఈ సినిమా సంగతులు సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna), ఈ సినిమాలో విలన్‌ గా నటించి మెప్పించిన కైకాల సత్యనారాయణ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

కృష్ణ మాట్లాడుతూ.. ‘మా పద్మాలయా సంస్థలో ‘అగ్నిపరీక్ష’ అనే సినిమా చేశాము. అయితే, ఆ సినిమాకి లాభాలు రాకపోగా, మేము పెట్టిన డబ్బులు కూడా పోయాయి. అయితే, ఆ సమయంలోనే కౌబాయ్‌ సినిమా ‘గుడ్‌ బాడ్‌ అగ్లీ’ రిలీజ్ అయింది. హాలీవుడ్‌ సినిమా కాబట్టి, సినిమా పై మంచి క్రేజ్ ఉంది. నేను కూడా సినిమాకి వెళ్లాను. ఆ చిత్రం చూసి నేను థ్రిల్‌ ఫీలయ్యాను. ఇలాంటి సినిమా ఇంతవరకు మన తెలుగులో రాలేదు కదా అనిపించింది.

తెలుగులో నేను హీరోగా ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే, వెంటనే ‘గుడ్‌ బాడ్‌ అగ్లీ’ సినిమా చూడమని ఆరుద్రగారికి చెప్పాను. ఆయన సినిమా చూసి, అందులో కథకు, ‘మెకన్నాస్‌ గోల్డ్‌’ అనే సినిమాలోని కొన్నిసీన్స్ ను కలిపి మొత్తానికి ఒక కథ తయారు చేసి ఇచ్చారు. నాకు కథ బాగా నచ్చింది. దర్శకుడు దాస్‌ ను పెట్టుకుని సినిమా చేశాము’ అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు.

కైకాల సత్యనారాయణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నాకు బాగా గుర్తు. మోసగాళ్లకు మోసగాడు’ సినిమా నిర్మాణ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి అనేక నెగిటివ్ కామెంట్స్‌ వచ్చాయి. ‘కౌబాయ్‌ చిత్రం ఏమిటి ? పైగా రాజస్థాన్‌ లో షూటింగ్‌ ఏమిటి ? అసలు కలర్‌ లో సినిమా చేయడం కృష్ణకు తెలుసా ? కృష్ణకు అంత సత్తా ఉందా?’ అంటూ చాలా కామెంట్స్ చేశారు.

కానీ కృష్ణ అవేమీ పట్టించుకోలేదు. ‘సాహసమే నా ఊపిరి’ అనే మనస్తత్వం కృష్ణది. అందుకే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తీసి హిట్ కొట్టాడు’ అంటూ సత్యనారాయణ తెలిపారు.