Superstar Krishna: ఇండస్ట్రీ మొత్తం ఈరోజు తెల్లవారుజామున సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్త ని విని శోకసంద్రం లో మునిగిపోయింది..మొన్న రాత్రి గుండెపోటు తో సిటీలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన కృష్ణ గారికి డాక్టర్లు CPR చేసి ఆయన ప్రాణాలను కాపాడి అత్యవసర చికిత్స ప్రారంభించారు..ఆయన ఆరోగ్య పరిస్థితి తొలుత నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..కానీ సాయంత్రం నుండి కృష్ణ గారి శరీరం లో అవయవాలు పనిచెయ్యడం మానేశాయి.

కిడ్నీ , బ్రెయిన్ ఇలా శరీరం లో ఒక్కొక్క అవయవం ఫెయిల్ అవుతూ రావడం తో కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతినింది అనే వార్త వచ్చింది..డాక్టర్లు ఆయన ప్రాణాలను నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసారు కానీ సఫలం కాలేదు..చివరికి ఈరోజు ఉదయం నాలుగు గంటలకు ఆయన మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణమయ్యారు..ఇది ఇండస్ట్రీ కి ఒక బ్లాక్ డే గా పరిగణించాల్సిన సందర్భం.
కృష్ణ గారి నట ప్రస్థానం ఒక స్వర్ణ యుగం లాంటిది..ఆయన చేసినన్ని సాహసాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చెయ్యలేదు..తోలి ఈస్ట్ మెన్ కలర్..తోలి కౌ బాయ్ సినిమా..తొలి 70 స్కోప్ సినిమా..ఇలా ఒక్కటా రెండా..నందమూరి తారకరామారావు గారి తర్వాత ఇండస్ట్రీ లో ప్రతి జానర్ లో సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో కృష్ణ గారు మాత్రమే..ఒక ఏడాది లో ఆయన 14 సినిమాలను విడుదల చేస్తే ఆ 14 సినిమాలు కూడా సూపర్ హిట్టైన సందర్భాలు ఉన్నాయి..కృష్ణ గారికి సినిమా అంటే ప్రాణం..365 రోజుల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లోనే కేవలం రెండు మూడు సినిమాలతో స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న ఏకైక హీరో ఆయన..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న కూడా కృష్ణ గారు పెద్దగా ఆస్తులను కూడగట్టుకోలేదని ఇండస్ట్రీ లో అందరూ చెప్పే మాట..ఆయన సినిమాలు సూపర్ హిట్టైన కూడా రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టేవారట.
ఇక కృష్ణ గారు తన సినిమా ఫ్లాప్ అయితే తన తదుపరి చిత్రం అదే నిర్మాతతో అప్పట్లో ఫ్రీ గా చేసేవారట..అలా ఆయన నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి..ఇక కృష్ణ గారు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేసాడు..వాటిల్లో సూపర్ హిట్ అయినవి ఉన్నాయి..ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి.. ఫ్లాప్ అయ్యినప్పుడు బయ్యర్స్ కి డబ్బులు తిరిగి ఇచ్చేసేవారట కృష్ణ..కానీ హిట్ అయ్యినప్పుడు మాత్రం డబ్బులు ఎగ్గొట్టేవారట.
అలా కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ ని స్థాపించి స్నేహితులను నమ్మి 300 కోట్ల రూపాయిలు నష్టపోయి అప్పులపాలయ్యారట..మహేష్ బాబు స్టార్ హీరో అయ్యాక ఆ అప్పులన్నీ తీర్చాడని ఇండస్ట్రీ లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు..అలా ఒక సూపర్ స్టార్ స్టేటస్ దక్కించుకొని కూడా కృష్ణ గారు మంచితనం తో ఇండస్ట్రీ లో ఎలాంటి ఆస్తులను ఏర్పర్చుకోలేకపోయారని ఆయన అభిమానులు చెప్తుంటారు.