https://oktelugu.com/

ఎన్టీఆర్ కి విలన్ గా సూపర్ స్టార్ ఫిక్స్ !

త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించినా అది విలన్ పాత్ర అయితే కాదు. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 11:32 AM IST
    Follow us on


    త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించినా అది విలన్ పాత్ర అయితే కాదు. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. అన్నట్లు ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమాని తీస్తున్నాడట.

    Also Read: తోడేలులా మారబోతోన్న బన్నీబాబు !

    కాకపోతే కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాటి ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారట. అలాగే ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెట్టి.. నేటి రాజకీయాలను వాడుకుని ప్రజలను ఎలా బఫూన్ చేశాడు.. ప్రస్తుత రాజకీయ నాయకులు అలాగే చేస్తున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడట. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తోన్నారు.

    Also Read: వైరల్ అవుతోన్న పవన్ లాస్ట్ డే షూట్ ఫోటోలు !

    ఇక ఒకప్పుడు ‘అతడు, జల్సా, ఖలేజా’ లాంటి యాక్షన్ సినిమాలు చేసిన త్రివిక్రమ్, ఈ మధ్య మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్లే చేస్తూ వస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్నా.. మన తెలుగు ప్రేక్షకులకు సరిపోయేట్టు అలాంటి కథనే అనుకున్నారని.. పైగా సినిమాలో మెయిన్ పాయింట్ కూడా పల్నాటి ప్రాంతానికి సంబంధించినది అని తెలుస్తోంది. ఇక రాజమౌళి సినిమా తరువాత ఎన్టీఆర్ కి వచ్చే కొత్త ఇమేజ్ ను మ్యానేజ్ చేయాలంటే.. కచ్చితంగా ఓ మంచి కథే ఉండాలి. అందుకే త్రివిక్రమ్ పాన్ ఇండియా స్టోరీతోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అయినా ఆల్రెడీ అనుకున్న పాత కథకే పాన్ ఇండియా రంగులు అద్దడమో, లేకపోతే కొత్తగా పెద్ద స్పాన్ ఉన్న స్టోరీని కాపీ కొట్టి కొత్త కథగా రాసుకోవడం త్రివిక్రమ్ కి పెన్నుతో పెట్టిన విద్య.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్