Acharya: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇక ఈ […]
Acharya: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే విడుదలకు సిద్దం అయ్యింది.
Acharya
కాగా, ఈ సినిమా భారీ బిజిసెన్ జురుపుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, థియేట్రికల్‌గా ఎంత భారీ బిజినెస్ జరుపుకుందో.. అందే లెవెల్లో ఓటీటీ డీల్ కూడా క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలో విడుదల కానుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ఆచార్య చిత్రం విడుదల కానుంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ”, బాబీతో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు రామ్‌చరణ్.. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్లో అడుగుపెట్టింది.