Rajanikanth: బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన హీరో రజనీకాంత్ పుట్టిన రోజు నేడు. రజనీ అసలు చాలా మందికి తెలిసిండకపోవచ్చు. ఆయన పేరు శివాజీరావు గైక్వాడ్. కర్ణాటకలో 1950, డిసెంబరు 12న ఆయన జన్మించారు. మధ్యతరగతి కుటుంబలో పుట్టి పెరిగిన ఆయన సినీ జీవితం 1975లో మొదలైంది. అంతకుముందు బస్కండక్టర్గా పనిచేశేవారు రజనీకాంత్. రజనీ కాంత్ నటించిన తొలి సినిమా తమిళ్లో వచ్చిన అపూర్వరాగంగళ్.
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సనిమా అప్పట్లో రజనీ సినీ కెరీర్‌కు మంచి తోడ్పాటు అందించింది. ఆ తర్వాత 1976లో ‘అంతులేని కథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ప్రేక్షకాభిమానులు ఆయన స్టైల్‌కు ఫిదా అయిపోయారు. అలా తిరుగులేని స్టార్‌గా గుర్తింపు సంపాదించి ఇప్పుడు కోట్లాది మంది హృదయాల్లో స్థానం దక్కించుకున్నారు.
https://twitter.com/Nayanthaara4/status/1469848777930407937?s=20
ఒకానొక ఇంటర్వ్యూల్లో రజనీ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావడానికి ఆయన పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అవకాశాల కోసం అందరి చుట్టూ తిరిగిన సంఘటనలనూ పలు సినిమాల్లో అందుకు తగ్గట్లు చూపించారు కూడా. ఇటీవలే పెద్దన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజనీ.. మొత్తం 167 సినమాల్లో నటించారు.
కాగా, 2016లో ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం లభించగా.. ఇటీవలేే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Wishing you a very happy birthday dear @rajinikanth. Stay healthy and blessed as always.
இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள் அன்பு ரஜினி#HBDSuperstarRajinikanth pic.twitter.com/ramDKn5ob3
— Mammootty (@mammukka) December 12, 2021