https://oktelugu.com/

Pushpa Trolls: ‘ఊ అంటావా మావా..’ను తెగవాడేస్తున్న ట్రోలర్స్.. రంగంలోకి బ్రహ్మీ.!

Pushpa Trolls మరో ఐదురోజుల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ థియేటర్లో సందడి చేయనుంది. డిసెంబర్ 17న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత ‘పుష్ప’లో నటించిన స్పెషల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేసింది. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న సమంత తొలిసారిగా ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2021 / 11:05 AM IST
    Follow us on

    Pushpa Trolls మరో ఐదురోజుల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ థియేటర్లో సందడి చేయనుంది. డిసెంబర్ 17న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత ‘పుష్ప’లో నటించిన స్పెషల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేసింది.

    సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న సమంత తొలిసారిగా ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ లో సమంత అందాలను అరబోసింది. సెక్సీ అప్పిల్ తో కుర్రకారు గుండెల్లో కాకరేపుతోంది. దీంతో ఈ సాంగ్ సౌత్ ఇండియాలోనే నెంబర్ 2గా యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది.

    ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ మొదటి స్థానంలో ఉండగా సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ సెకండ్ ప్లేసులో నిలిచింది. ఈ సాంగ్ కు డీఎస్పీ మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. గాయని ఇంద్రావతి చౌహన్ తన మత్తు వాయిస్ తో ఈ పాటకు ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది.

    అయితే ఈ సాంగ్ సూర్య నటించిన ‘వీడొక్కడే’ మూవీలోని ‘హనీహనీ’సాంగ్ లా ఉండటంతో ట్రోలర్స్ రంగంలోకి దిగారు. ఈ పాటను దేవీశ్రీ కాపీ చేశాడంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పనిలో పనిగా తమ క్రియేటివీటిని ఉపయోగించి ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ సాంగ్ ను ఎడిటింగ్ చేసి వీక్షకులను ఎంటటైన్ చేస్తున్నారు.

    ప్రస్తుతం ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ సాంగ్స్ పై నడుస్తున్న ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ ను ప్రముఖ కామెడీయన్ బ్రహ్మనందానికి అన్వయిస్తూ చేసిన ఎడిటింగ్ సూపర్ గా ఉన్నాయని స్వయంగా దేవీశ్రీ ప్రసాదే పొగడ్తల వర్షం కురిపిస్తూ రీ ట్వీట్ చేశాడు. అలాగే డార్లింగ్ ప్రభాస్ ను సైతం ఈ సాంగులో వాడేస్తున్నారు ట్రోలర్స్.

    సమంత బ్రహ్మనందాన్ని కాపీ కొడుతుంటూ చేసిన మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తంగా సమంత స్పెషల్ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ‘పుష్ప’కు కావాల్సినంత ప్రమోషన్ చేసి పెడుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. డిసెంబర్ 17న థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప’పై అభిమానులు మాత్రం భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

    https://twitter.com/ThisIsDSP/status/1469560505748443136?s=20