Guntur Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు థియేటర్స్ లో ఆదరణ దక్కించుకోలేకపోయాయి కానీ, కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలకు ఆడియన్స్ నుండి మంచి విలువ దక్కాయి. ఈ ఏడాది విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం కూడా ఆ కోవకు చెందిన సినిమాగా నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి థియేటర్స్ లో డిజాస్టర్ రెస్పాన్స్ రాగా, ఓటీటీ మరియు టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ సినిమాని ఎలా ఫ్లాప్ చేసారు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ రావడం వంటివి కూడా మనమంతా గమనించే ఉంటాం. అలాంటి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమాకి పాటలు కూడా అంతే ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ పాట మన టాలీవుడ్, లేదా ఇండియన్ ఆడియన్స్ ని మాత్రమే కాదు, ప్రపంచం లో ఉన్న ఫారిన్ జనాలకు కూడా తెగ నచ్చేసింది.
ఫలితంగా ఈ పాటకు ఇప్పటి వరకు యూట్యూబ్ లో 527 మిలియన్ కి పైగా వ్యూస్, మూడు మిలియన్ల లైక్స్ వచ్చాయి. అతి త్వరలోనే ఈ పాట 1 బిలియన్ క్లబ్ లోకి కూడా చేరనుంది. అయితే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ ని సాధించిన టాప్ 5 సాంగ్స్ లో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి కూడా చోటు దక్కడం గమనార్హం. గడిచిన దశాబ్ద కాలం లో మహేష్ బాబు కి ఈ స్థాయి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇప్పటి వరకు పడలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. డ్యాన్స్ తో తమ అభిమాన హీరో ప్రపంచ రికార్డు ని నెలకొల్పుతాడని మహేష్ బాబు అభిమానులు కూడా ఊహించి ఉండరు. కేవలం మహేష్ బాబు డ్యాన్స్ మాత్రమే కాకుండా, శ్రీలీల డ్యాన్స్ కూడా తెగ వైరల్ గా మారింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్స్ సినిమాలకు సంబంధించిన పాటలు విడుదలైన ఈ సంవత్సరంలో మహేష్ బాబు పాట ప్రపంచ రికార్డుని నెలకొల్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘గుంటూరు కారం’ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఇలాంటి కొన్ని అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పడం మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చింది. ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పలు చోట్ల స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేయగా, ఆ షోస్ కి సంబంధించిన టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. దీనిని బట్టి ఈ చిత్రానికి ఇటీవల కాలం లో ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మహేష్ బాబు త్వరలోనే డైరెక్టర్ రాజమౌళి తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి నాల్గవ వారం నుండి ఈ సినిమా కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.