Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో చంద్ర యోగం ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ సమస్యలు పూర్తవుతాయి. కష్టపడిన వారికి సరైన ఫలితాలు అందుతాయి. కొందరు శత్రువులు వేధించడానికి ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. పాత స్నేహితులను కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): అనుకోని కారణంగా ప్రయాణాలు ఉంటాయి. కొందరు ఇబ్బందులు కలిగించే వ్యక్తులు ఎదురవుతారు. పిల్లల కోరికలను నెరవేర్చడానికి కష్టపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొన్ని పనుల కారణంగా ఈరోజు బిజీగా ఉంటారు.కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది
ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబ సభ్యులతో వ్యాపారం చేసేవారు ఈరోజు ఎక్కువ లాభాలు పొందుతారు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన ప్రాజెక్టులో ఒకటి సక్సెస్ అవుతుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగులు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పని చేపట్టిన శ్రద్ధగా చేయాలి. లేకుంటే కష్టాలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. దీంతో ఆర్థికంగా మెరుగుపడతారు. విద్యార్థులు కెరీర్ పట్ల శ్రద్ధ వహించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : సోదరుల సహకారంతో కొత్త ఆదాయ వనరులు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. పిల్లల కోసం పెట్టుబడులు పెడితే అవి భవిష్యత్తులో అధిక ప్రయోజనాలు ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొత్త కోర్సులో చేరే విద్యార్థులకు ఇదే మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులకు అనుకోకుండా అధిక లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కుటుంబంతో కలిసి సమయం గడుపుతారు. కొన్ని విచారకరమైన వార్తలు వింటారు. కొందరు శత్రువులు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆర్థికంగా పుంజుకుంటారు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే అది విజయవంతం అవుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. చిన్నవివాదం జరిగితే వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఏ కష్టమైన పని అయినా సులభంగా చేయగలుగుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అవి భవిష్యత్ లో లాభాలు ఉంటాయి. ఉద్యోగులు నిరాశ వార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు లాభాలు ఎక్కువగా పొందుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొందరికి ధన సహాయం చేస్తారు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.