https://oktelugu.com/

AP Floods: ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు అండగా సూపర్ స్టార్ మహేష్ బాబు…

AP Floods: ఆంధ్రప్రదేశ్‏ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వర్షాలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు అని చెప్పాలి. ఇక పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా… భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కాగా వారికి ఏపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ఇల్లు కోల్పోయిన వారికి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 07:40 PM IST
    Follow us on

    AP Floods: ఆంధ్రప్రదేశ్‏ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వర్షాలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు అని చెప్పాలి. ఇక పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా… భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కాగా వారికి ఏపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా మరణించిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది జగన్ సర్కార్. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

    ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ వరద విపత్తు బాధితుల సహాయానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న సాయంగా నేను 25 లక్షల రూపాయలను అందిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం వరధ బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా రూ. 25 లక్షలు ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దీంతో చిరంజీవి, రామ్ చరణ్ ల నుంచి ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి రూ. 50 లక్షలు విరాళం అందింది.

    ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి తన వంతు సాయంగా రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వినాశకరమైన వరదల దృష్ట్యా, నేను సిఎంఆర్ఎఫ్ కి 25 లక్షలు అందించాలనుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నానని మహేష్ ట్వీట్ చేశాడు.

    https://twitter.com/urstrulyMahesh/status/1466016888056549377?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1466016888056549377%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fmegastar-chiranjeevi-mahesh-babu-and-ram-charan-each-one-donates-25-lakhs-to-the-cm-relief-fund-for-recent-rains-floods-victims-in-ap-588293.html