Akhanda Twitter Review: ఇటీవల ఫ్లాపులతో సింహం ఒక అడుగు వెనక్కి వేసిందని అనుకుంటే పొరబాటే.. అంతే వేగంగా దూసుకొచ్చి దెబ్బ తీయగలదు.. ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా అదే చేశాడని అంటున్నారు ప్రేక్షకులు.. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. వారికి పూనకాలు తెప్పించేలా మాస్ ఊరమాస్ నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడట బాలయ్య బాబు.
Akhanda balakrishna
బాలయ్య బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అఖండ’ నేడు డిసెంబర్2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్స్ అమెరికా సహా ఓవర్సీస్ లో పడ్డాయి. ఈ సినిమా చూసిన జనాలు తమ అభిప్రాయాలను ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
బాలక్రిష్ణ-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. బోయపాటి ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ అప్డేట్స్, టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.
https://twitter.com/B4Politics/status/1466193600321101830?s=20
ఈరోజు రిలీజ్ అవుతున్న ‘అఖండ’ మూవీ ఓవర్సీస్ లో నిన్న రాత్రియే ప్రివ్యూలు పడ్డాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయలు వెల్లడిస్తున్నారు.
‘ఫస్టాఫ్ అదిరిపోయిందని.. మాస్ ఆడియన్స్ కు కిక్కిచ్చేలా బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని ట్విట్టర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అభిప్రాయడ్డారు. సెకండాఫ్ కూడా అంతకుమించిన ఊరమాస్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. బాలయ్య నట విశ్వరూపం ఇందులో చూపించాడని.. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, విలన్ శ్రీకాంత్ యాక్టింగ్ అదిరిపోతుందని అంటున్నారు.
Boyapati Srinu learnt from VVR Mistakes.#akhanda hits the Bulls eye.
Masses will love it.
As the movie committed to its soul, directed succeeded in elevating aghora charecter. Thaman RR 👏
Good watch. 3/5. #NandamuriBalakrishna #AkhandaMassJathara #akhandaReview— I'm what I am (@imAnaloof) December 1, 2021
తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఇది కంప్లీట్ మాస్ ప్యాకేజీ అని ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరు బాలయ్య ‘అఘెరా’ పాత్ర అయితే సినిమాలో హైలెట్ అని ప్రశంసిస్తున్నారు.
అదిరిపోయే సీన్స్, బాలయ్య డైలాగ్స్ చూస్తూ ఆయన ఫ్యాన్స్ థియేటర్స్ లో గోల పెట్టేస్తున్నారని ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. బోయపాటి టేకింగ్, బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయంటున్నారు. యాక్షన్స్ ఎపిసోడ్స్ లో బాలయ్య నభూతో నభవిష్యతిలాగా కనిపించాడని ట్విట్స్ పడుతున్నాయి. ప్రతీ యాక్షన్ సన్నివేశం గూస్ బాంబ్స్త్ తెప్పించే విధంగా ఉందని ట్విట్టర్ లో రెస్పాన్స్ వస్తోంది.
https://twitter.com/BhavaniPrasadN9/status/1466182479321055233?s=20
అఖండ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ప్రారంభం అవుతుందని.. బాలయ్య తన కవల పిల్లలిద్దరి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే సన్నివేశంతో సినిమా మొదలవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రగ్యాజైస్వాల్ జిల్లా కలెక్టర్ గా నటిస్తోందని అంటున్నారు.
సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని.. మునివేళ్లపై నిలబెడుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బోయపాటి బాలయ్య అభిమానులకు గొప్ప చిత్రాన్ని అందించారని ట్వీట్స్ పడుతున్నాయి.
Also Read: Mega family: ఏపీలో వరద బాధితుల అండగా మెగా హీరోలు… విరాళాలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్
https://twitter.com/pandu_kdp/status/1466211688038862851?s=20
ఇక సెకండ్ హాఫ్ లో కాస్త అక్కడక్కడ బోరింగ్ సీన్లు పడ్డాయని హీరోయిన్ లెంగ్త్ ఎక్కువైందని.. కామెంట్స్ వస్తున్నాయి. అఖండ మూవీ మల్టీప్లెక్స్ సినిమా కాదని.. బీ, సీ సెంటర్ ఆడియన్స్ ను అలరిస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మొత్తంగా విలన్ రోల్ లో శ్రీకాంత్ ఇరగదీశాడని.. బాలయ్య శివతాండవం చేస్తున్నాడని.. ఈ సారి ప్రేక్షకులను అఖండ అలరించడం గ్యారెంటీ అని అంటున్నారు. మాస్ ఆడియెన్స్ పండుగ చేసుకునే సినిమా అంటున్నారు.
Also Read: 83 Movie: 83 సినిమాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి డబ్బింగ్ చెప్పిన టాలీవుడ్ హీరో సుమంత్…