https://oktelugu.com/

సింగర్ సునీత, ఆమె భర్త రామ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

సింగర్ సునీత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ, ఆమె వయసు ఎంత ? ఆమె భర్త వయసు ఎంత ? ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ? అసలు ఆమె ఇప్పుడు ఉన్నట్టు ఉండి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు ? ఇలా నెటిజన్లు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. రామ్ సూరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్.. ఒక విధంగా డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. అందుకే ఆయనకు […]

Written By: , Updated On : January 20, 2021 / 10:10 AM IST
Follow us on

Singer Sunita and her husband Ram
సింగర్ సునీత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ, ఆమె వయసు ఎంత ? ఆమె భర్త వయసు ఎంత ? ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ? అసలు ఆమె ఇప్పుడు ఉన్నట్టు ఉండి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు ? ఇలా నెటిజన్లు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. రామ్ సూరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్.. ఒక విధంగా డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. అందుకే ఆయనకు ఆస్తులు కూడా బాగా ఉన్నాయట . ఇక రామ్ వయసు ఎంత అనేది కూడా చాలామంది సర్చ్ చేసారు. రామ్ వీరపనేని కి, సునీతకు వయసులో ఎంత గ్యాప్ ఉందనేది వెతికారు నెటిజన్లు.

Also Read: ‘మాస్టర్’ మూవీ వసూళ్లు చూస్తే షాకే..

కాగా రామ్ వీరపనేని మే 26, 1974న జన్మించారు. అంటే ఆయన వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. ఇక సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి మధ్య కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉండటం, ఇద్దరూ ఒంటరిగానే ఉండటంతో మొత్తానికి పెళ్లి వైపు అడుగులు వేశారు. ఇక రామకృష్ట వీరపనేని ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్‌లు ఉన్నాయట. కాగా సునీత సింగర్ గా రాణిస్తోంది. ఆమెది సొంతూరు గుంటూరు. సునీతకు ఇంటర్ చదువుతున్న టైంలోనే సినిమా పాట పాడే అవకాశం వచ్చింది.

Also Read: చిరంజీవి ఇలా సర్ ప్రైజ్ చేస్తాడనుకోలేదు

మొదటిగా 1995లో “గులాబీ” సినిమా కోసం “ఈ వేళలో ఏమి చేస్తూ ఉంటావో” అనే పాట పాడి.. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే కిరణ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఆమెకు పిల్లలు పుట్టారు. సునీత కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. ఆకాష్ ఢిల్లీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే కూతురు శ్రేయ ఇప్పటికే సినిమాల్లో పాట కూడా పాడి తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్