https://oktelugu.com/

కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయం బాగా తెలుసు. ఎక్కడా తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. ఎవరిని ఎలా కొట్టాలో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని రాటుదేలి.. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్.. సమకాలనీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు లేరంటారు. కేసీఆర్ స్కెచ్ వేస్తే ఎంతటి బలమైన వారు కూడా తోకముడవాల్సిందేనంటారు. అలానే చంద్రబాబును పక్కరాష్ట్రం పంపించాడంటారు. అందుకే ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2020 / 06:10 PM IST
    Follow us on


    తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయం బాగా తెలుసు. ఎక్కడా తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. ఎవరిని ఎలా కొట్టాలో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని రాటుదేలి.. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్.. సమకాలనీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు లేరంటారు. కేసీఆర్ స్కెచ్ వేస్తే ఎంతటి బలమైన వారు కూడా తోకముడవాల్సిందేనంటారు. అలానే చంద్రబాబును పక్కరాష్ట్రం పంపించాడంటారు.

    అందుకే ఇప్పుడు తన భావి వారసుడు కేటీఆర్ కు కేసీఆర్ పలు కీలక అంశాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాడట.. బెదిరింపులను, సవాళ్లను అవకాశాలుగా ఎలా మలుచుకోవాలో సూచనలు ఇస్తున్నాడట..

    బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

    ఇటీవల ప్రగతి భవన్ పై కరోనా దాడి చేసింది. దీంతో కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఫాంహౌస్ కు వెళ్లాడు. కేసీఆర్ కు కరోనా వచ్చిందని అంటున్నారు. అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు. హైదరాబాద్ లో లేని కేసీఆర్ ఇప్పుడు దీనిని ఒక అవకాశంగా కేటీఆర్ కు మార్చాడని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.

    తాజాగా ప్రగతి భవన్ లో రోజువారీ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలని సీఎం కేసీఆర్ తన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరాడట.. దీంతో కేటీఆర్ వివిధ మంత్రిత్వశాఖలు, అధికారులతో రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ స్థానంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడట.. కేటీఆర్ తన పరిధిలోకి రాని మంత్రిత్వశాఖల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.

    ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

    ప్రస్తుతం కేటీఆర్ తెలంగాణలో వర్కింగ్ సీఎంగా పనిచేస్తున్నాడట.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తుండగా.. కేటీఆర్ ప్రగతి భవన్ కోటను నడిపిస్తున్నాడని టీఆర్ఎస్ లో టాక్.

    నిజానికి కేసీఆర్ ఇలా చేయడం రాబోయే రోజుల్లో కేటీఆర్ కు ఒక రకమైన సీఎం శిక్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్ లో ఇది కేటీఆర్ కు పరిపాలనను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని.. భవిష్యత్ వ్యూహాలను రూపొందించడానికి సహాయపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.. ఈ విధంగా కేసీఆర్ ఇంతటి కరోనా క్లిష్ట సమయంలో వైదొలిగి తన కుమారుడు కేటీఆర్ కు సవాళ్లు ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది..

    -ఎన్నం