పైగా ఈ సినిమాని కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రంజిత్ రూపొందించడం విశేషం. అసలు, విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నాడు అనగానే.. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాకి భారీ బజ్ వచ్చింది. చిన్న సినిమాగా మొదలై.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది ఈ సినిమా.
అన్నట్టు త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానున్న ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్, కరణ్ సి. ప్రొడెక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమాలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్ కూడా నటిస్తున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రూమర్ నిజం అయితే.. ఈ సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినట్టే.
ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ లుక్ కోసం సందీప్ కిషన్ ప్రస్తుతం ఫిట్ నెస్ పై ఫుల్ దృష్టి పెట్టాడట. రోజుకు ఐదు గంటల పాటు సందీప్ జిమ్ లో ఫుల్ వర్కౌట్లు చేస్తున్నాడు. సందీప్ కిషన్ వర్కౌట్స్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగావైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్ల సంగతి ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు.
సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ (Gully Rowdy) సినిమా రిలీజ్ ఇప్పటికే పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ‘గల్లీ రౌడీ’ సినిమాని ఎప్పుడో ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చి అది కుదరలేదు. ఎలాగైనా సోలోగా తన సినిమాని రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు.