SIIMA 2019 Nominations: సైమా నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే ?

SIIMA 2019 Nominations: హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు18, 19 తేదీల్లో సైమా వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో 2019వ ఏడాదికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల్లో విజేతల ఎంపిక కోసం నామినేషన్లు వెలువడ్డాయి. మరి నామినేషన్ లో ఎవరు ఉన్నారు అంటే..? దక్షిణాదిన ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘సైమా'(SIIMA). పూర్తి పేరు ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’. ఈ వేడుక కరోనా కారణంగా గత మూడేళ్లుగా జరగడం లేదు. కాగా హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు18, […]

Written By: admin, Updated On : August 27, 2021 4:29 pm
Follow us on

SIIMA 2019 Nominations: హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు18, 19 తేదీల్లో సైమా వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో 2019వ ఏడాదికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల్లో విజేతల ఎంపిక కోసం నామినేషన్లు వెలువడ్డాయి. మరి నామినేషన్ లో ఎవరు ఉన్నారు అంటే..?

దక్షిణాదిన ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘సైమా'(SIIMA). పూర్తి పేరు ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’. ఈ వేడుక కరోనా కారణంగా గత మూడేళ్లుగా జరగడం లేదు. కాగా హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు18, 19 తేదీల్లో ఈ సైమా ఘన వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో 2019వ ఏడాదికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల్లో విజేతల ఎంపిక కోసం నామినేషన్లు వెలువడ్డాయి.

మరి ఆ నామినేషన్ల లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

ఉత్తమ విలన్‌ కేటగిరీలో :

జగపతి బాబు (మహర్షి),
రెజీనా కస్సాండ్ర (ఎవరు),
వివేక్‌ ఒబెరాయ్‌ (వినయ విధేమ రామ),
సోనూసూద్‌ (సీత).
కార్తికేయ (నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌),

ఉత్తమ గాయని కొరకు :

సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ (ఓ బావ- ప్రతిరోజూ పండగే),
యామిని ఘంటసాల (గిర గిర- డియర్‌ కామ్రేడ్‌).
చిన్మయి (ప్రియతమ ప్రియతమ -మజిలీ),
సునిధి చౌహాన్‌, శ్రేయా ఘోషల్‌ (సైరా టైటిల్ గీతం),
మంగ్లి (వాడు నడిపే బండి- జార్జిరెడ్డి),

ఉత్తమ గాయకుడు లిస్ట్ లో :

అనురాగ్‌ కులకర్ణి (ఇస్మార్ట్‌ శంకర్‌ టైటిల్‌ గీతం),
శంకర్‌ మహదేవన్‌ (పదర పదర- మహర్షి),
సిధ్ శ్రీరామ్‌ (అరెరె మనసా- ఫలక్‌నుమాదాస్‌),
సుదర్శన్‌ అశోక్‌ (ప్రేమ వెన్నెల- చిత్ర లహరి).
ఎం.ఎల్‌.ఆర్‌. కార్తికేయన్‌ (తందానే తందానే- వినయ విధేయ రామ),

అన్నట్టు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలకు సంబంధించి కూడా ఈ నామినేషన్లూ వచ్చాయి. అయితే, మీకు నచ్చిన వారికి ఎలా ఓట్లు వేసి గెలిచాలి అనుకుంటున్నారా ? www.siima.in ద్వారా మీకు నచ్చిన గాయనీగాయకులకు మరియు విలన్ కు ఓట్లు వేసి గెలిపించొచ్చు.