https://oktelugu.com/

ఇది కరెంట్‌ బిల్లా.. వీకెండ్‌ సినిమా కలెక్షనా!

కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే బిల్లుల పేరుతో వారి జేబులు గుల్ల చేస్తున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో కరెంట్‌ బిల్లులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు ఈ బిల్లులు షాకిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే తంతు జరుగుతోంది. ఊహించని మొత్తంలో బిల్లులు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు స్నేహ, కార్తీక, తాప్సీ వంటి ప్రముఖులు తమ ఇళ్లకు వచ్చిన కరెంట్ […]

Written By:
  • admin
  • , Updated On : June 30, 2020 / 02:58 PM IST
    Follow us on


    కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే బిల్లుల పేరుతో వారి జేబులు గుల్ల చేస్తున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో కరెంట్‌ బిల్లులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు ఈ బిల్లులు షాకిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే తంతు జరుగుతోంది. ఊహించని మొత్తంలో బిల్లులు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు స్నేహ, కార్తీక, తాప్సీ వంటి ప్రముఖులు తమ ఇళ్లకు వచ్చిన కరెంట్ బిల్లులు చూసి షాకయ్యారు. వాటి గురించి ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్‌ మీడియా వేదికగా నిరసన తెలిపారు.

    బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

    ఇప్పుడు టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్ కు ప్రభుత్వం కరెంట్‌ బిల్లుతో షాకిచ్చింది. తన ఇంటికి వచ్చిన బిల్లు చేసి బిత్తరపోయిన ఈ యంగ్‌ స్టర్ దీని గురించి ట్వీట్ చేశాడు. ఇది కరెంటు బిల్లా.. లేక కొత్త సినిమా వీకెండ్‌ కలెక్షనా అని సెటైర్ వేశాడు. ‘మా ఇంటి దగ్గర ఎలక్ట్రిసిటీ బోర్డు (కరెంట్) మీటర్ చూస్తుంటే అంచనాలకు అందని చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్‌ లైన్‌లో వార్ స్టార్ట్‌ ఐనా ఆశ్చర్యం లేదు. ఈబీ (కరెంట్‌) బిల్స్‌ కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్‌ను తలపిస్తున్నాయి’ అని  సందీప్ పేర్కొన్నాడు.