https://oktelugu.com/

బాలీవుడ్‌లో ‘బంధుప్రీతి’కి నేనూ బాధితురాలినే

ప్రియాంక చోప్రా. మాజీ మిస్‌ వరల్డ్‌. మోడలింగ్‌ నుంచి సినిమాల్లో అడుగుపెట్టి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎదిగిన టాలెంటెడ్‌ యాక్ట్రెస్. అక్కడి నుంచి హాలీవుడ్‌లో అడుగు పెట్టి గ్లోబల్‌ స్టార్ గా మారిందామె. పాప్‌ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకొని యూఎస్‌లో సెటిలైందామె. ఇంత సక్సెస్‌ సాధించిన ప్రియాంక కూడా కెరీర్ తొలి నాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. బాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ‘బంధుప్రీతి’ (నెపోటిజం)లో తాను కూడా ఓ బాధితురాలినే అని ప్రియాంక […]

Written By: , Updated On : June 30, 2020 / 02:47 PM IST
Follow us on


ప్రియాంక చోప్రా. మాజీ మిస్‌ వరల్డ్‌. మోడలింగ్‌ నుంచి సినిమాల్లో అడుగుపెట్టి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎదిగిన టాలెంటెడ్‌ యాక్ట్రెస్. అక్కడి నుంచి హాలీవుడ్‌లో అడుగు పెట్టి గ్లోబల్‌ స్టార్ గా మారిందామె. పాప్‌ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకొని యూఎస్‌లో సెటిలైందామె. ఇంత సక్సెస్‌ సాధించిన ప్రియాంక కూడా కెరీర్ తొలి నాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. బాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ‘బంధుప్రీతి’ (నెపోటిజం)లో తాను కూడా ఓ బాధితురాలినే అని ప్రియాంక వెల్లడించింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలిచి.. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పింది.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నెపోటిజానికి వ్యతిరేకంగా పలువురు సినీ ప్రముఖులు గళమెత్తుతున్నారు. దీని గురించి ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. బాలీవుడ్‌లో అన్ని రకాలుగా బంధుప్రీతి ఉన్నదన్న పీసీ.. గొప్ప వారసత్వం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పేమీ కాదని అభిప్రాయపడింది. అయితే, బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు అనేక అవాంతరాలు దాటాల్సి వస్తే.. తమ కుటుంబ పేరు నిలబెట్టాలన్న ఒత్తిడి స్టార్ కిడ్స్‌పై ఉంటుందని చెప్పింది. అందువల్ల యాక్టర్ సొంతంగానే ప్రయాణం సాగించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. తన ప్రయాణంలో ఎదురైనా అవంతరాల గురించి ఆమె మాట్లాడింది.

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

తాను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని… ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ప్రియాంక చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రెకమెండేషన్ తో వచ్చిన ఒక హీరోయిన్ కోసం, తనను ఓ సినిమా నుంచి తప్పించారని తెలిపింది. దాంతో, తాను చాలా ఏడ్చానని కానీ తొందర్లోనే దాన్ని మరిచిపోయి ముందడుగు వేశానని చెప్పింది. అదే ఇంటర్వ్యూలో, ఆమె కూడా ‘వైఫల్యం’ గురించి కూడా మాట్లాడింది. వైఫల్యం గురించి తనకు భయం లేనప్పటికీ అది తనకు నచ్చదని చెప్పింది. సినీ ప్రముఖుల జీవితాలను మారథాన్‌ రన్నర్లతో పోల్చిన పీసీ వారిపై ఎన్నో బాధ్యతలు ఉంటాయంది. ఒక సెలబ్రిటీ అనారోగ్యానికి గురై షూటింగ్ రద్దు చేస్తే 300 మందికి వేతనం రాదని గుర్తు చేసింది. అందువల్ల ప్రతి ఒక్కరి పనిని ఎలా గౌరవించాలో తనకు తెలుసని, అలాగే, తాను ఎంచుకున్న లక్ష్యాన్ని ఎలా అందుకోవాలనే విషయంలో స్వీయ శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది.