Sumanth: అక్కినేని కుటుంబం నుండి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో సుమంత్(Sumanth). ఇప్పటికీ సుమంత్ అంటే ఆడియన్స్ లో చెక్కు చెదరని ఇమేజ్ ఒకటి ఉంది. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడంటే కచ్చితంగా ఆ చిత్రం లో విషయం ఉంటుంది అని గుడ్డిగా నమ్మేయొచ్చు. కెరీర్ ప్రారంభం లో కొన్ని ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ, ‘సత్యం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, ఆ తర్వాత గౌరీ, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఈమధ్య కాలంలో హీరో రోల్స్ కంటే క్యారక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చిన సుమంత్, రీసెంట్ గా ‘అనగనగా’ అనే చిత్రం ద్వారా మరోసారి హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 15న ఈటీవీ విన్ యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.
Also Read: అక్షరాలా 450 రోజులు..చరిత్ర తిరగరాసిన ‘సలార్’..ప్రపంచం లోనే మొదటి సినిమా!
రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమంత్ మరో భావోద్వేగ పూరిత సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అనే సూచన ఇచ్చింది ఈ ట్రైలర్. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుమంత్ నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), నాగేశ్వర రావు(ANR) గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వీరిలో మేము అడిగే సెలబ్రిటీల గురించి ఒక్క మాటలో చెప్పండి అని ముందుగా నాగేశ్వరరావు గారి పేరుని చెప్తారు. దానికి సుమంత్ సమాధానం చెప్తూ ‘నాగేశ్వరరావు గారితో నాకున్న అనుబంధం ఎంతో స్పెషల్. మేమిద్దరం తండ్రీకొడుకులు లాగా ఉండేవాళ్ళం. ఆయన నన్ను ఎప్పుడూ కొడుకు లాగానే చూసుకునే వాడు. ఆయన పంచిన ప్రేమని జీవితాంతం మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఆ తర్వాత నాగార్జున గురించి అడగ్గా, కాసేపు ఆలోచించడం మొదలు పెట్టిన సుమంత్ ‘ఆయన గురించి ఏమి చెప్పాలో నాకు స్పష్టంగా తెలియడం లేదు, ఎందుకంటే ఆయన గురించి ఏమి చెప్పాలో కరెక్ట్ గా తెలియదు. నటన పరంగా నాగార్జున గారు ఒక లెజెండ్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆరోజుల్లో నాగేశ్వరరావు గారు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నాడు. అలా ఈ జనరేషన్ లో నాగార్జున గారు తయారయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. సుమంత్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ కూడా సినిమాల్లోకి హీరోయిన్ అవుదామని వచ్చి, ఆ తర్వాత సైలెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈమె చేసిన ఒకే ఒక్క చిత్రం పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆమె ‘గూఢచారి’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది.