AC Report : వేసవి కాలం మొదలైందంటే చాలు ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి, రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి చాలా మంది ఇళ్లల్లో ఏసీలు ఏర్పాటు చేసుకుంటారు. వేసవిలో ఏసీ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. భారతదేశంలో ఎంత మంది ఇళ్లల్లో ఏసీలు ఉన్నాయో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏసీ మార్కెట్ మనదే అయినప్పటికీ, కేవలం ఏడు శాతం ఇళ్లల్లో మాత్రమే ఏసీలు ఉన్నాయట.
ఈ గణాంకాలు చూస్తుంటే..ఇప్పటికీ 93 శాతం మందికి ఎయిర్ కండీషనర్ ఒక స్టేటస్ సింబల్‌గానే ఉండిపోయినట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2012 నుంచి 2021 మధ్య భారతదేశంలో దాదాపు 11 వేల మంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read : శరీరంలో ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కువగా శుభ్రం చేయకండి.. ఎందుకో తెలుసా?
ధరలే కారణమా?
ఈ డేటాను చూస్తే చాలా ఇళ్లల్లో ఇప్పటికీ వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కూలర్‌లను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ధరే అని చెప్పకోవాలి. ఎయిర్ కండీషనర్లతో పోలిస్తే ఎయిర్ కూలర్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది అయితే 40-50 వేలు ఏసీ కోసం ఎందుకు ఖర్చు చేయాలి, 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కూలర్ అందుబాటులో ఉన్నప్పుడు అని కూడా ఆలోచిస్తుండవచ్చు. చాలా మంది డబ్బు ఆదా చేసి పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఒకవైపు డబ్బు ఆదా చేయడం కోసం ఏసీ కంటే ఎయిర్ కూలర్‌లను కొనడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయినా కొంతమంది మాత్రం 30,000 రూపాయల జీతం ఉన్నవారు కూడా 40 వేల రూపాయల ఏసీని కొంటున్నారు. కొంత మొత్తం డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని సులభమైన ఈఎంఐలలో చెల్లిస్తున్నారు.
కంపెనీల వ్యూహం
ఎక్కువ మంది ఏసీలు కొనుగోలు చేసేలా చూడటానికి, ఏసీ తయారు చేసే కంపెనీలు ప్రత్యేక వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. 7 శాతం ఉన్న ఈ సంఖ్యను పెంచడానికి కంపెనీలు కృషి చేస్తాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ, కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 7 శాతం ఇళ్లల్లో మాత్రమే ఏసీల వినియోగం ఉండడం నిజంగా ఆశ్చర్యకరం.