https://oktelugu.com/

Sumanth Varahi: వారాహి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమా అవుతుందా..?

అయితే ఈ మధ్య వారాహి అనే పేరు బాగా పాపులర్ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ క్యాంపెన్ కోసం రెడీ చేసుకున్న వాహనం పేరు వారాహి కావడం తో ఈ పేరు రెండు రాష్ట్రాల ప్రజలకి చాలా ఫెమస్ అయిందనే అనే చెప్పాలి..

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2023 / 05:24 PM IST

    Sumanth Varahi

    Follow us on

    Sumanth Varahi: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మంచి నటులలో సుమంత్ ఒకరు. ఈయనకి హిట్లు అంతగాలేవు కానీ సినిమా అంటే చాలా ప్యాషన్ అయితే ఉంది.అందుకే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో ఒక మంచి టేస్ట్ ఉన్న హీరో గా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లా కాకుండా తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని ఆయన ముందుకు వెళ్తున్నారు ఇక ఆయన కెరియర్ లోమంచి సక్సెస్ సాధించిన సినిమాలు గా చెప్పుకునే సత్యం,సుబ్రమణ్య పురం, మళ్లీ రావా సినిమాలతో తనకంటూ కొన్ని మంచి హిట్ల ని కూడా దక్కించుకున్నాడు. ఇక ఎంత మంచి సినిమాలు చేసిన ఇక్కడ ఫైనల్ గా అందరికి హిట్లే కావాలి,ఇక్కడ హిట్లు మాత్రమే మాట్లాడుతాయి అని అంటారు కాబట్టి ఈయనకి కూడా ప్రస్తుతం ఒక మంచి హిట్ సినిమా కావాలి. అందుకే ఆయన ఇప్పుడు తనకి ఇంతకు ముందు సుబ్రమణ్య పురం లాంటి హిట్ సినిమాని ఇచ్చిన సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే వారాహి…

    అయితే ఈ మధ్య వారాహి అనే పేరు బాగా పాపులర్ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ క్యాంపెన్ కోసం రెడీ చేసుకున్న వాహనం పేరు వారాహి కావడం తో ఈ పేరు రెండు రాష్ట్రాల ప్రజలకి చాలా ఫెమస్ అయిందనే అనే చెప్పాలి…ఇక ప్రస్తుతం సుమంత్ వారాహి అనే ఒక మంచి టైటిల్ తో వస్తున్నందుకు అక్కినేని అభిమానులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక సుమంత్ లాంటి హీరో డైరెక్టర్లకి అవకాశాలను ఇచ్చేటపుడు చాలా ఆలోచిస్తాడు కానీ సంతోష్ కి రెండోసారి కూడా అవకాశం ఇచ్చాడు అంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయనకి అంత మంచి అవకాశం ఇస్తాడు.అలాగే సంతోష్ కూడా ఈ సినిమా తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ తో ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తిచేసాడు.వీళ్ల కాంబో లో వచ్చిన సుబ్రమణ్య పురం ఎంత మంచి హిట్ అయిందో అంతకు మించి మంచి హిట్ కొట్టడానికి ఇప్పుడు ఈ సినిమాని రెడీ చేస్తున్నాడు డైరెక్టర్… అందులో భాగంగానే రీసెంట్ గా కాశీ లో ఒక భారీ షెడ్యూల్ షూట్ చేయడం జరిగింది. దింట్లో సినిమాకి సంబందించిన కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించినట్లు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో సుమంత్ ఒక సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతా లో వేసుకోబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది…ఇక డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి గురించి చెప్పాలంటే ఈయన మొదటి సినిమా అయిన సుబ్రమణ్య పురం సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు, ఆ తర్వాత నాగశౌర్య హీరో గా లక్ష్య అనే సినిమా చేసాడు ఈ సినిమా లో నాగశౌర్య చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేసాడు డైరెక్టర్… ఇక దాంతో పాటు నాగశౌర్య మేకోవర్ లో కూడా చాలా వరకు కొత్తదనాన్ని చూపించాడు. ఒక విల్లు ఎలాగైతే స్ట్రాంగ్ గా అండ్ స్ట్రెయిట్ గా ఉంటుందో అలా తన బాడీ ని కూడా ఒక విల్లు లాగా తయారు చేయించాడు డైరెక్టర్ సంతోష్… అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా థియేటర్ లో కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పటికీ ఓటిటి లో మాత్రం ది బెస్ట్ వ్యూయర్షిప్ ని సొంతం చేసుకుంది.ఇక తన మూడోవ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒక సూపర్ హిట్ కొట్టడమే లక్ష్యం గా ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం వీళ్ళకి చాలా ప్లస్ అయింది. మధు కలిపు గారు ఇంతకు ముందు రంగమార్తాండ లాంటి ఒక గొప్ప సినిమాని ప్రొడ్యూస్ చేసి ఒకమంచి సినిమాను తీశారు అని అందరు మెచ్చుకునే స్థాయి ని సంపాదించుకున్న ఒక ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో ఆయన మంచి పేరు పొందాడు.ఇక ఈ సినిమాతో డైరెక్టర్ ఒక మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం…