Sumanth : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్న హీరోలందరు ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…ఇప్పటివరకు వాళ్ళందరూ చేసిన సినిమాలు వాళ్లను ఉన్నత స్థానంలో నిలుపుతున్నప్పటికు పాన్ ఇండియాలో వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఒక్కో సమయంలో కొన్ని జానర్స్ సినిమాలకి మంచి ఆదరణ అయితే దక్కుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలకి మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నప్పటికి ఫీల్ గుడ్ సినిమాలకు మాత్రం కొన్ని సందర్భాల్లోనే ఆదరణ అయితే దక్కుతోంది. ప్రేక్షకులు సైతం ఆ సినిమాలను ఆదరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం సుమంత్ చేసిన ‘అనగనగా’ (Anaganaga)సినిమా ఈనెల 15 వ తేదీ నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సంపాదించుకుంది. ఈ మూవీ కి వస్తున్న ఆదరణ చూసిన మేకర్స్ ఈ సినిమాని థియేటర్ కి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ అనుకున్నారు.
కానీ అతనికి సరైన సక్సెస్ లు పడకపోవడంతో ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… ఇక నాని హీరోగా వచ్చిన జెర్సీ(Jersy) సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ ను చాలా అద్భుతంగా చూపించారు.
Also Read : నాగార్జున గురించి చెప్పడానికి ఏమి లేదు..ఆయన అలాంటి వాడే : సుమంత్
అలాగే ఆ సినిమా ఒక క్లాసికల్ మూవీగా నిలిచిపోవడమే కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ గా ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఇక అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన అనగనగా సినిమా కూడా ప్రేక్షకులను మరొక లోకంలోకి తీసుకెళ్లింది… ఈ సినిమాతో సుమంత్ (Sumanth) మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇచ్చిన హైప్ తో రాబోయే సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని మరోసారి తన మార్కెట్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో సుమంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది…