https://oktelugu.com/

Suma Kanakala: సుమ కనకాల పరువు తీసిన బబుల్ గమ్ మూవీ…

ప్రముఖ యాంకర్ అయిన సుమా కనకాల, యాక్టర్ రాజీవ్ కనకాల కొడుకు... రాజీవ్ కనకాల విషయం పక్కన పెడితే సుమా అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ చాలా ఇష్టం ఉంటుంది.

Written By: , Updated On : December 30, 2023 / 11:33 AM IST
Suma Kanakala

Suma Kanakala

Follow us on

Suma Kanakala: ఇవాళ్ల,రేపు యూత్ సినిమాలంటూ చెప్పి బూతు సినిమాలను తీసి స్క్రీన్ పైన వడిలుతున్నరు.అది చూసిన ప్రేక్షకులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. సినిమా మొత్తం సొల్లు నడిపించి ఆ తర్వాత రిలైజేషన్ లాగా పెట్టి సినిమా సక్సెస్ సాధించాలని చాలామంది దర్శక నిర్మాతలు చూస్తున్నారు. అలాంటి కేటగిరీలోకి వచ్చే సినిమానే బబుల్ గమ్… ఈ సినిమాలో హీరోగా రోషన్ కనకాల నటించాడు. ఈయన ప్రముఖ యాంకర్ అయిన సుమా కనకాల, యాక్టర్ రాజీవ్ కనకాల కొడుకు… రాజీవ్ కనకాల విషయం పక్కన పెడితే సుమా అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ చాలా ఇష్టం ఉంటుంది.ఎందుకంటే ఆమె చేసినన్ని టివి షో లు గానీ,ఈవెంట్స్ గాని, ఎవ్వరు చేయలేదు ఆనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఆమె ఏ షోకైతే హొస్ట్ గా చేస్తుందో ఆ షో తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది అనెంత రేంజ్ లో ఆమె గుర్తింపు పొందింది. ఇన్ని సంవత్సరాలుగా తన కెరియర్ లో ఇంతవరకు ఎప్పుడూ కూడా ఒక తప్పు మాట గాని, తప్పుడుగా ప్రవర్తించడం గానీ చేసిన దాఖలాలు లేవు. చిరంజీవి దగ్గరనుంచి కొత్త హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఈవెంట్ కి యాంకర్ గా సుమ నే తీసుకుంటారు అంత పద్ధతిగా ఉండే ఆమె మాత్రం తన కొడుకు అయిన రోషన్ కనకాలని సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో మాత్రం చాలా తప్పుడు నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా అంటే ఆమెకు ఉన్న నాలెడ్జ్ ఏంటో మనకు అర్థం కాలేదు కానీ ఆమె దృష్టిలో యూత్ సినిమా అంటే ఓ నాలుగు కిస్సులు, ఓ నాలుగు పాటలు లాస్ట్ లో రియలైజేషన్ అనే బ్రమ లోనే తను ఉన్నట్టుగా అర్థమవుతుంది.

అందుకే తన కొడుకు లాంచింగ్ సినిమాకి అలాంటి ఒక వెర్రి కథను ఎంచుకొని సినిమా గా చేయాలని పట్టుబట్టి మరి అదే కథతో సినిమా చేసి చాలా విమర్శలను ఎదుర్కొంటుంది. నిజానికి ఒక సెలబ్రిటీ కొడుకు హీరోగా లంచ్ అవుతున్నాడు అంటే చాలా కథలను విని చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యే విధంగా చూసుకుంటారు. కానీ సుమ కనకాల స్క్రిప్ట్ మొత్తం దగ్గర ఉండి చూసుకుంటూ తనే స్క్రిప్ట్ లో చేంజెస్ చేసి మరి ఇలాంటి ఒక బి గ్రేడ్ మూవీలో తన కొడుకును హీరోగా పరిచయం చేసింది. రోషన్ కనకాల సెలబ్రిటీ కొడుకు కాకపోతే ఆయనకు హీరో అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆయనకున్న ఫేస్ వాల్యూ కి సినిమాలో హీరో గా చేసే కెపాసిటీ అయితే లేదు.సరే అందం గా లేకపోయిన ఏదైనా యాక్టింగ్ లో ఇరగ్గోడతాడా అనుకుంటే సినిమాలో అది కూడా పెద్దగా ఏమీ పండించలేదు.

అయితే ఒక్క సినిమాతో మనం ఆయన్ని జడ్జ్ చేయలేము గాని ఫ్యూచర్ లో యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని చాలా బాగా యాక్టింగ్ చేయగలిగితే మాత్రం తను స్టార్ హీరో అయ్యే రేంజ్ కి వెళ్తాడు అని మాత్రం చెప్పగలము. కానీ ముఖ్యంగా స్క్రిప్ట్ సెలక్షన్ లోనే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి… బబుల్ గమ్ సినిమాని ఎందుకు తీసారు అంటే హీరోయిన్ పెదాలని రోషన్ బబుల్ గమ్ లా నమ్మడానికి తీశారు తప్ప దాంట్లో పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ లేదు డైరెక్టర్ రవి కాంత్ ఇంతకుముందు తీసిన క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.మరి ఇలాంటి ఒక లస్ట్ స్టోరీ తో ఈ సినిమా ఎందుకు తీశాడో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు…