Bigg Boss Telugu 7 TRP Ratings: వినేవాడు వెర్రి వాడయితే.. చెప్పేవాడు భగవత్ స్వరూపుడు అని వెనకటికి ఓ సామెత ఉండేది. ఇప్పుడు ఈ సామెతను నిజం చేసే పనిలో పడింది స్టార్ మా అనే తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. స్టార్ గ్రూపు ఈ ఛానల్ ను టేక్ ఓవర్ చేసిన తర్వాత.. బిగ్ బాస్ అనే రియాల్టీ షోను రన్ చేస్తోంది. ఇప్పటికీ చాలా సీజన్లు పూర్తయ్యాయి. ఇటీవల కూడా ఒక సీజన్ విజయవంతంగా (మా టీవీ దృష్టిలో) పూర్తయింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ అనే ఓ తిక్క క్యారెక్టర్ ను విజేతగా ప్రకటించారు. అతడు రైతుబిడ్డ ఏమిటో, అతడు విజయం సాధిస్తే సామాన్యుడికి దక్కిన గౌరవం ఏమిటో? మా టీవీ యాజమాన్యానికే తెలియాలి. అన్నట్టు ఈ సీజన్లో ఉల్టా పుల్టా అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్టు.. మా టీవీ యాజమాన్యం నాగార్జునతో చెప్పించింది. అంతేకాదు చివరికి ఈ సీజన్లో అత్యధిక టిఆర్ఎస్ రేటింగ్స్ సాధించిందని గొప్పలు చెప్పుకుంది. కానీ తరచి చూస్తే అది అబద్ధమని తేలిపోయింది. అంతేకాదు మాటివి చెప్పిన రేటింగ్స్ చూస్తే ఆ చానల్లో ప్రసారమయ్యే బ్రహ్మముడి అనే సీరియల్ కంటే లో ఫెర్ఫార్మన్స్ చేసింది. మరి దీనిని తోపు రేటింగ్స్ అని మా టీవీ యాజమాన్యం ఎలా చెప్పుకుంటుందో దానికి తెలియాలి.
ఎస్.. తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో మాటీవీది నెంబర్ వన్ స్థానం. సరే ఆ టిఆర్పి రేటింగ్స్ మన్నూ మశానం వదిలేస్తే.. ఆ ఎంటర్టైన్మెంట్ రంగంలో తిరుగులేని స్థానంలో ఉండేందుకు మా టీవీ చేయని ప్రయోగం అంటూ లేదు. చాలాసార్లు ఇవి వికటించినప్పటికీ మాటీవీ దానిని వదులుకోలేదు. హాయిగా నెంబర్ వన్ స్థానంలో ఉంది కాబట్టి కోట్లల్లో ఎండార్స్మెంట్లు వస్తూనే ఉంటాయి. వాటిని కాపాడుకుంటూనే కొత్త వాటిని దక్కించుకోవాలంటే ఇంకా తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని మా టీవీ యాజమాన్యం ఆలోచన. ఇది మంచిదే అయినప్పటికీ ఆ ఆలోచనను కంటెంట్ విషయంలో కూడా ఉండాలి కదా.. సరిగా ఇక్కడే మా టీవీ యాజమాన్యం పప్పులో కాలేస్తోంది. అంతే కాదు అబద్ధపు రేటింగ్స్ తో తనకున్న క్రెడిబుల్టిని కోల్పోతోంది. సరే ఆ రేటింగ్స్ అనేది పెద్ద మాయాజాలం కాబట్టి దాన్ని ఎవడు నమ్ముతాడు అంటారా? ఆ రేటింగ్ కదా టీవీలకు ఎండార్స్మెంట్లు తీసుకొచ్చేది.
ఉన్న ఒప్పందం మేరకు బిగ్ బాస్ ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేశాడు. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ ఇంకా ఎవరెవరినో తీసుకొచ్చారు. ఈసారి ఉల్టా పుల్టా అంటూ ఏదో కొత్తరకం ప్రయోగం చేస్తామని షోకు ముందే భారీగా ప్రచారం చేశారు. కానీ షోలో అవే వెగటు స్కిట్లు, అవే దరిద్రపు చాలెంజ్ లు.. అందులో కొత్తదనం ఏముందని? పైగా దానినే తెగ ప్రచారం చేసుకుంది మా టీవీ యాజమాన్యం. కానీ తీరా రేటింగ్స్ విషయానికి వచ్చేసరికి అవే పూర్ పర్ఫామెన్స్.. పైగా ఈ సీజన్లో శివాజీకి అమితమైన ప్రాధాన్యమించింది మా టీవీ యాజమాన్యం. పల్లవి ప్రశాంతును విచిత్రంగా ప్రకటించింది.. మరి దానికి అనుసరించిన విధానాలు ఏమిటో ఆ ఛానల్ ఇంతవరకు ప్రకటించలేదు. పైగా ఆ స్పై టీమ్ లో శోభా శెట్టి దర్జాగా ధిక్కరించింది. అయినప్పటికీ ఆమె విషయంలో మా టీవీ యాజమాన్యం పక్షపాత ధోరణి ప్రదర్శించింది. ఇక చివరికి గ్రాండ్ గా జరిగిన ఫైనల్ లోనూ మా టీవీ యాజమాన్యం సేమ్ అదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు.. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేదు. ఇంతోటి దానికి.. ప్రచారం మాత్రం బీభత్సంగా చేసుకుంది. రేటింగ్స్ ఏకంగా 21.7 వచ్చాయని చెప్పుకుంటుంది. ఏపీ ప్లస్ టి ఎస్ కలిపి ఈ ఘనత సాధించామని అంటున్నది. ఇక ఆ శివాజీ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానులు, టేస్టీ తేజ అభిమానులు.. ఎవరికివారు ఆ రేటింగ్స్ మా వల్లే అంటే మా వల్లే అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఫైనల్ అయిపోయిన తర్వాత శివాజీ నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయని ఒక కంటెస్టెంట్ ఆరోపిస్తోంది. విజేతగా నిలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ వ్యవహార శైలి ఎలా ఉందో చూసాం. అమర్దీప్ ఇవాల్టి వరకు పత్తా లేడు.. పల్లవి ప్రశాంత్ అంతటి వ్యవహారాలకు పాల్పడినప్పటికీ కొంతమంది కంటెస్టెంట్లు ఆయనకు అండగా ఉంటున్నారు. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన పర్వాలేదు అని సంకేతాలు ఇస్తున్నారా.. ఇక రేటింగ్ విషయం పరిశీలిస్తే మా టీవీ చెప్పుకున్నట్టుగా ఏమీ లేదు. 21.7 కాదు వచ్చింది. జస్ట్ 13.7 మాత్రమే. అవి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి.. పైగా మాటీవీలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ కంటే తక్కువ రేటింగ్స్ అవి. మా టీవీ బిగ్ బాస్ షోను చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు ఎండార్స్ చేస్తాయి కాబట్టి.. వాటిని సంతృప్తి పరిచేందుకే ఈ రేటింగ్స్ అబద్ధమాడుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ విషయం నాగార్జునకు తెలుసో? తెలియదో?