Anasuya Bharadwaj: తెలుగులో యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ తనదైన రీతిలో యాంకరింగ్ లో అదరగొట్టి జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇక దాని తర్వాత ఆమె వరుసగా కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరించినప్పటికీ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. ఇక అప్పటినుంచి ఆమెకి వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ ని చాలా బిజీ గా గడుపుతుంది.
ఇక అందులో భాగంగానే ఆమె చేసిన టీవీ షో లన్నింటికీ బ్రేక్ ఇచ్చి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వస్తుంది. ఇక ఇప్పటికి కూడా అనసూయ కి ఉన్న క్రేజ్ అనేది ఏ మాత్రం తగ్గలేదు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో కాత్యాయని క్యారెక్టర్ ని పోషించి పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది. రీసెంట్ గా శివప్రసాద్ యానాల దర్శకత్వం లో వచ్చిన విమానం సినిమాలో సముద్రఖని తోపాటు లీడ్ రోల్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకుంది.
ఇక ఇదిలా ఉంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన అప్డేట్ ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వాటి ద్వారా కొన్ని కాంట్రవర్సి ల్లో ఇరుక్కున్నప్పటికీ అన్నిటినీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు ఆమె కి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు కొన్ని పిక్స్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. దానికి తగ్గట్టుగానే ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అనసూయకి మేకప్ లేకపోతే ఇంత దారుణంగా ఉంటుందా అంటూ అనసూయ పైన ట్రోల్స్ చేస్తున్నారు.
అనసూయ ఏది చేసిన ఇంతకుముందు ప్రతి ఒక్కరు దాన్ని ట్రోల్ చేస్తూ వచ్చేవారు మధ్యలో కొంతమంది మీద ఆమె సైబర్ పోలీస్ లకు కంప్లైంట్ కూడా చేసింది. ఇప్పుడు కూడా ఆమెని కొంతమంది ట్రోల్ చేస్తూ ఆమె పిక్స్ ని వైరల్ చేస్తున్నారు…మరి ఆమె ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…నిజానికి ఆమె ట్రోలర్స్ మీద అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ రీయాక్ట్ అయింది….