https://oktelugu.com/

Suma Adda: సుమ షోలో శివాజీకి అతని ఫోన్ కాల్… ఎవరో తెలిసి సుమ షాక్, దద్దరిల్లిన వేదిక!

బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ పెంచుకున్న శివాజీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా శివాజీ హౌస్ లోకి వెళ్ళక ముందు ఓ వెబ్ సిరీస్ లో నటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2024 / 04:37 PM IST

    Suma Adda

    Follow us on

    Suma Adda: బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా ముగిసింది. ఎన్నడూ లేని విధంగా రెస్పాన్స్ దక్కింది. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కొందరు ఫుల్ క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా స్పై బ్యాచ్ అయిన శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లకు వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. శివాజీ, ప్రశాంత్, యావర్ ల మధ్య హౌస్ లో ఉన్నప్పుడు బాండింగ్ ఏర్పడింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. గెట్ టు గెదర్ పార్టీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.

    బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ పెంచుకున్న శివాజీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా శివాజీ హౌస్ లోకి వెళ్ళక ముందు ఓ వెబ్ సిరీస్ లో నటించారు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ టైటిల్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శివాజీ, తొలి ప్రేమ ఫేమ్ వాసుకి ఈ వెబ్ సిరీస్ లో భార్యాభర్తలుగా నటించారు. 90వ దశకం నాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల పరిస్థితులని ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.

    ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ, వాసుకి, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లు సుమ అడ్డా షో లో పాల్గొన్నారు. అయితే యాంకర్ సుమ ఎప్పటిలానే పంచులతో సందడి చేసింది. శివాజీ తో కలిసి ఫుల్ రచ్చ చేసింది. ఇక శివాజీకి లైవ్ లో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా అంటూ సుమ చూసింది. కానీ ఆ ఫోన్ చేసింది ఎవరో చూసి షాక్ అయింది. శివాజీకి ఫోన్ చేసింది పల్లవి ప్రశాంత్ దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

    అక్కడున్న ఆడియన్స్ కూడా ప్రశాంత్ ఫోన్ చేయడంతో అరుపులు, కేకలతో వేదిక హోరెత్తించారు. ఒక్కసారిగా వేదిక దద్దరిల్లిపోయింది. మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. అనంతరం శివాజీ సుమతో… మిమ్మల్ని మార్నింగ్ పార్క్ లో చూశాను అని ఫ్లర్ట్ చేస్తాడు. నేను పార్క్ కి వెళ్ళలేదు కదండీ అంటుంది. దీంతో శివాజీ… నెమలిలా ఉంటే మీరే అనుకున్నా, అనడంతో సుమ సిగ్గు పడుతుంది. చాలా ఫన్నీ గా ప్రోమో సాగింది.