https://oktelugu.com/

Tollywood Directors: సక్సెస్ ఫుల్ డైరెక్టర్లంతా ఏ హీరోలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నిఖిల్ శర్వానంద్ వంటి వారు ఒకరు.వీరిలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 11, 2024 / 04:45 PM IST

    Tollywood Directors

    Follow us on

    Tollywood Directors: వస్తూ వస్తూ పండుగ తెచ్చారు అనే నానుడిలా.. కొంత మంది హీరోలుగా ఎంట్కీ ఇస్తూ మరికొంత మంది నటులను, లేదా డైరెక్టర్లను తెస్తుంటారు. కొంత మంది హిట్ లు అందుకొని దూసుకెళ్తుంటే.. మరికొందరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోతారు. అయితే ఇప్పుడు స్టార్ డం సంపాదించిన కొంత మంది హీరోలు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో డైరెక్టర్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారెవరు? వారు పరిచయం చేసిన డైరెక్టర్లు ఎలా ఉన్నారు. అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

    స్డూడెంట్ నెం.1 లో అలా ఆర్ఆర్ఆర్ లో ఇలా..
    తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నిఖిల్ శర్వానంద్ వంటి వారు ఒకరు.వీరిలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఫేమ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ప్రపంచ నలుమూలలా అభిమానులను సంపాదించాడు ఎన్టీఆర్. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎన్టీఆర్ కొత్తడైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్, రాజమౌళి వంటి వారు డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొత్తం మీద ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవార్డులను అందుకున్న వీరి కాంబినేషన్ సినిమా ఆర్ఆర్ఆర్. అలా ఎన్టీఆర్ పరిచయం చేసిన డైరెక్టర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్.

    కళ్యాణ్ రామ్ కూడా…
    ఇక కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి దర్శకులలో అనిల్ రావిపూడి, వశిష్ట, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనీల్ రావిపూడి పటాస్ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే సినిమాకు దర్వకత్వం వహించాడు సురేందర్ రెడ్డి. అయితే కళ్యాణ్ రామ్ పరిచయం చేసినటువంటి ఈ దర్శకులు కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

    నిఖిల్..
    యంగ్ హీరో నిఖిల్ నటించిన స్వామి రారా సినిమాకు సుదీర్ వర్మ దర్శకత్వం వహించారు. అలాగే చందు మొండేటి కార్తికేయ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించడంతో ఈ ఇద్దరు డైరెక్టర్లలకు ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉంది.

    శర్వానంద్..
    వీరితోపాటు హీరో శర్వానంద్ సైతం ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేశారు. శర్వా హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచమయ్యారు సుజిత్. ప్రస్తుతం సుజిత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ నలుగురు హీరోలు కొత్త డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసినప్పటికీ వీరు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ దర్శకులు మాత్రం ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కొనసాగడం విశేషం. ఇలా వీరు పరిచయం చేసిన డైరెక్టర్లు మంచి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకులుగా పేరు సంపాదించారు. అయితే రాజమౌళి గుర్తింపు మాత్రం అందరికంటే భిన్నమనే చెప్పాలి.