Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ప్రస్తుతం పాన్ ఇండియాలో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్న ఆయన తన మొదటి సినిమా అయిన ఆర్య మూవీ నుంచి పుష్ప 2 సినిమా వరకు తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తైతే ఇకమీదట నుంచి సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా భారీ క్రేజ్ ను సంపాదించి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… గత సంవత్సరం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేశాడు… 1850 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బాహుబలి 2 (Bahubali 2) రికార్డును సైతం బ్రేక్ చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది… ఇక ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) తో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో సుకుమార్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ తన రైటింగ్ టీం కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. డైరెక్షన్ టీమ్ కంటే కూడా రైటింగ్ టీం కి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడని చాలామంది సైనిక మేధావులు సైతం చాలా సందర్భాల్లో తెలియజేశారు.
కారణం ఏంటి అంటే మొదటినుంచి కూడా ఆయన రైటర్ గా ఉండడం వల్ల వాళ్ల యొక్క వాల్యూ అతనికి తెలుసు…ఈ రోజుల్లో రైటర్ కి పెద్దగా వాల్యూ ఇవ్వకుండా వారిని వాడుకొని వదిలేస్తున్న సందర్భంలో సుకుమార్ మాత్రం తన రైటింగ్ టీమ్ లో దాదాపు 5 నుంచి 6 మందిని పెట్టుకొని వాళ్లకు సకాలంలో జీతాలను చెల్లిస్తూ వాళ్ల చేత మంచి కథలను రాయించుకుంటూ ఉంటాడు.
ఇక సీన్లలో డిఫరెంట్ వర్షన్స్ ను కూడా రాయిస్తూ బెస్ట్ సీన్ వచ్చేంతవరకు తను తీవ్రమైన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు… ఈ మధ్యకాలంలో రైటర్లకు పెద్దగా వాల్యూ లేదనే ఉద్దేశ్యంతో కొంతమంది రైటర్స్ డైరెక్టర్స్ గా మారుతుంటే సుకుమార్ దగ్గర ఉన్న రైటర్స్ మాత్రం చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు…