https://oktelugu.com/

Sukumar and Dil Raju : కెరియర్ మొదట్లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్…కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే... మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నట్టు గానే దర్శకులు కూడా భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2025 / 02:11 PM IST

    Dil Raju , Sukumar

    Follow us on

    Sukumar and Dil Raju : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న దర్శకులలో సుకుమార్ ఒకరు. ఇప్పటికే ఆయన రంగస్థలం, పుష్ప పుష్ప 2 లాంటి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ సక్సెస్ పను అందుకొని పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. మరి ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుండటం విశేషం…ఇక ఇప్పటికే ‘బాహుబలి 2’ సినిమా రికార్డు బ్రేక్ చేసిన ‘పుష్ప 2’ సినిమా తొందర్లోనే ‘దంగల్ ‘ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయడానికి ముందుకు సాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈరోజు పాన్ ఇండియా డైరెక్టర్గl గా ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మొదటి సినిమాగా చేసిన ఆర్య సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన దిల్ రాజు తనదైన రీతిలో ఈ సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి ఒకానొక సందర్భంలో దిల్ రాజు ఇక సినిమా మీద కేటాయించిన బడ్జెట్ మొత్తం అయిపోయింది. అని సుకుమార్ కి చెప్పారట. కానీ సినిమాలో ఒక ఇంపార్టెంట్ మాంటెజ్ ఉండడంతో దాన్ని చిత్రీకరించకపోతే సినిమా అనేది ఆడదు అని సుకుమార్ వాదించారట.

    అయినప్పటికీ దిల్ రాజు అప్పుడే కొత్త బ్యానర్ కాబట్టి ఆయన దగ్గర అంత డబ్బు లేదని చెప్పారట. సినిమా ఆడితే ఆడింది పోతే పోయింది పర్లేదు అని చెప్పినప్పటికి సుకుమార్ మాత్రం తన సినిమా ఫ్లాప్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో దిల్ రాజు గారి కాళ్లు పట్టుకొని మరి ఒక్క మాంటేజ్ షూట్ చేద్దాం సార్…

    ఈ ఒక్క దానికి బడ్జెట్ పెట్టండి పక్కాగా సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారట. దాంతో దిల్ రాజ్ కూడా కాదనలేక మాంటేజ్ సీన్స్ తీయించారట. ఇక మొత్తానికైతే ఆ మాంటేజ్ వల్లే సినిమా సూపర్ సక్సెస్ అయిందని ఇప్పటికి సుకుమార్ నమ్ముతూ ఉంటాడు.

    అందుకే తనకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన దిల్ రాజ్ అంటే ఆయనకి అమితమైన ఇష్టమని రీసెంట్ గా కొన్ని సందర్భాల్లో ఆయన తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈరోజు ఇండియా గర్వించదగ్గ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడంటే తనకు ముందు అవకాశం ఇచ్చిన దిల్ రాజు కూడా చాలా గొప్ప వ్యక్తి అనే చెప్పాలి…