Sukumar : గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకునేవారు కాదు. కానీ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినా ఏంటో అందరికీ తెలిసింది. అలాగే ఇప్పుడు సినిమాతో మరోసారి భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయి ఏంటో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. నిజానికి సుకుమార్ లాంటి దర్శకుడు పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని సాధించి తన ఖాతాలో ఇండస్ట్రీ హిట్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాకి భారీ కలెక్షన్స్ రావడం అనేది సుకుమార్ రేంజ్ స్టామినాను పెంచడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా భారీ సక్సెస్ ని దక్కించుకోవడమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు…సుకుమార్ మహేష్ బాబు తో చేసిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా అప్పుడున్న ప్రేక్షకుల ఆలోచన తీరుకు భిన్నంగా ఉండడం అలాగే ప్రేక్షకుడి యొక్క అంచనాలను అందుకోలేకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది.
ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సుకుమార్ సినిమాలు చేయకూడదని అనుకున్నారట. కానీ యూఎస్ఏ లో ఈ సినిమా మంచి రికార్డులను క్రియేట్ చేయడం మంచి వసూళ్లను రాబట్టడంతో తను మరోసారి మంచి సినిమాలు చేయాలని అనుకున్నారట. గేమ్ చేంజర్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను యూఎస్ఏ లో నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు.
మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలను ఆపేసి ఉంటే తెలుగు సినిమా స్థాయి అనేది ఈ రేంజ్ లో ఎలివేట్ అయ్యేది కాదని మరి కొంతమంది సినిమా పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా ఇప్పుడు తను చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించడమే కాకుండా భారీ రికార్డులను కూడా కొల్లగొట్టే దిశగా సుకుమార్ ముందుకు అడుగులు వేస్తూ ఉండడం చూస్తుంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి.
ఇక తను రామ్ చరణ్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రంగస్థలం అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అలాగే తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచిన ఈ సినిమా తో రామ్ చరణ్ లోని నటుడు బయటికి రావడమే కాకుండా ఆయన ఇలాంటి పాత్రల్లో కనిపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో అలాంటి పాత్రలో రామ్ చరణ్ ని చూపించి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…