https://oktelugu.com/

Kasthuri Shankar: ప్రతి రాత్రి ఆ తప్పు చేయకుండా ఉండలేకున్నాను, తెల్లారాక బాధపడుతున్నాను, నాగార్జున హీరోయిన్ కి అదో పెద్ద వీక్నెస్

తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన కస్తూరి శంకర్ తన వీక్నెస్ ఓపెన్ గా చెప్పేసింది. రాత్రి తొమ్మిదైతే తనను ఓ కోరిక ఇబ్బంది పెడుతుందట. ఆ పని చేయకుండా ఆమె ఉండలేకున్నారట. మరుసటి రోజు ఉదయం, రాత్రి చేసిన తప్పు తలచుకుని బాధపడుతుందట.

Written By:
  • S Reddy
  • , Updated On : December 30, 2024 / 09:56 AM IST

    Kasthuri Shankar

    Follow us on

    Kasthuri Shankar: దాదాపు మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది కస్తూరి శంకర్. ఈ తమిళ భామ తెలుగులో చాలా చిత్రాలు చేసింది. నాగార్జునకు జంటగా నటించిన అన్నమయ్య ఇండస్ట్రీ హిట్. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య మూవీలో కస్తూరి శంకర్, రమ్యకృష్ణ హీరో నాగార్జున మరదళ్ల రోల్స్ చేశారు. అలాగే దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు చిత్రంలో కస్తూరి సిస్టర్ రోల్ చేసింది. భారతీయుడు మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్.

    ప్రస్తుతం కస్తూరి శంకర్ క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. అలాగే ఇంటింటి గృహలక్ష్మి పేరుతో ఒక డైలీ సీరియల్ చేసింది. స్టార్ మా లో గతంలో సదరు సీరియల్ ప్రసారమైంది. ఇటీవల కస్తూరి అరెస్ట్ అయ్యారు. పురాతనకాలంలో తమిళనాడుకి వలస వచ్చిన తెలుగువారు ఇక్కడి రాజుల అంతఃపురాల్లో సేవకులుగా ఉండేవారు. వాళ్ళు తమిళనాడులో స్థిరపడి, ఇక్కడ పుట్టి పెరిగిన బ్రాహ్మణులను తమిళులు కాదని అంటున్నారంటూ అనుచిత కామెంట్స్ చేశారు.

    కస్తూరి కామెంట్స్ ని ఖండిస్తూ చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పరారైన కస్తూరిని హైదరాబాద్ లో ఒక నిర్మాత ఇంటిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం తమిళనాడుకు తరలించి విచారించారు కస్తూరి అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. బీజేపీ పార్టీలో చేరిన కస్తూరి పొలిటికల్ గా కూడా క్రియాశీలకంగా ఉన్నారు. కస్తూరి మాటలు పలు సందర్భాల్లో వివాదాలకు దారి తీశాయి.

    చాలా ఓపెన్ గా ఉండే కస్తూరి.. తన వీక్నెస్ ని కూడా పంచుకుంది. రాత్రి తొమ్మిది గంటలు కాగానే తనకు ఆలు చిప్స్ తినాలనే కోరిక కలుగుతుందట. అది మంచి అలవాటు కాదు. అనారోగ్యం అని తెలిసినా ఆ కోరికను అణచుకోలేకపోతుందట. మరలా ఉదయం లేచాక.. అయ్యో రాత్రి ఆలు చిప్స్ ఎందుకు తిన్నానా.. అని బాధపడుతుందట. ఈ వీక్నెస్ ని అధిగమించలేకపోతున్నానంటూ.. ఓ ఇంటర్వ్యూలో కస్తూరి చెప్పుకొచ్చింది. ఆలు చిప్స్ అనారోగ్యకరం. అలాగే డైట్ ఫాలో అయ్యేవారు, అవైడ్ చేస్తారు. మరి నటిగా చక్కని శరీరాకృతి మైంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. రాత్రివేళ జంక్ ఫుడ్ తినడం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఆలు చిప్స్ తినకూడదని కస్తూరి అనుకుంటుంది. కానీ వాటి మీదున్న ఇష్టంతో కంట్రోల్ చేసుకోలేకపోతుంది అట.