Prabhas : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వాళ్లలో హీరో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు…ఎందుకంటే ఆయన చేసిన ‘బాహుబలి’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలిసింది. నిజానికి ఈ సినిమా కనక లేకపోతే మనవాళ్ళు ఇప్పటికి ఒక తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అనేది భారీ రేంజ్ లో విస్తరించడమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమాల వైపు చూసే విధంగా చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేయడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తున్న తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హెల్త్ తరచుగా చెడిపోతూ ఉంటుంది. కారణం ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రతి సినిమా సమయంలో ఆయన తన హెల్త్ బాలేదని కొద్ది రోజులపాటు ఇటలీ వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాడు.
కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికి ఎవరికి సరైన సమాధానమైతే దొరకడం లేదు. ఒకసారి లెగ్ ఇంజూరీ అయింది అంటారు. ఒకసారి షోల్డర్ ఇంజురీ అంటారు. ప్రభాస్ బాహుబలి సినిమాలో చాలా బాగా కనిపించాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటిలో ఆయన ఫేస్ లో గ్లో అయితే మిస్ అయింది. అలాగే ఆయన బాడీ కూడా నాచురల్ గా కనిపించడం లేదు.
కారణం ఏదైనా కూడా బాహుబలి సినిమా చేయడం వల్లే ఆయన బాడీ మీద ఎఫెక్ట్ పడింది అంటూ చాలామంది సినిమా మేధావులు చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి రాజమౌళి ప్రభాస్ చేత భారీ ఎక్సర్ సైజులు చేయించి డైట్ మెయిటైన్ చేయిస్తూ ఒక క్రమ పద్ధతిలో అతని బాడిని బిల్డ్ చేయించాడు. కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అసలు డైట్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా తినడం చేయడంతో బాడి షెప్ ఔట్ అయిపోయిందని కూడా చెబుతూ ఉంటారు.
మళ్ళీ తిరిగి తన బాడీ ని తను పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందంటూ మరి కొంతమంది చెబుతారు. ఇక బాహుబలి సినిమా వల్లే తన బాడీ ఇలా అయిందని అందరూ చెబుతుంటారు… ఇక ఏది ఏమైనా కూడా తొందర్లోనే ప్రభాస్ కి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని పోయి మళ్లీ బాహుబలి లోని ప్రభాస్ ని మనం చూడాలని కోరుకుందాం…