Rajamouli- Sukumar: రాజమౌళిని మించిపోయిన సుకుమార్

ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువు అడుగుజాడల్లో నడవాల్సిందే. కానీ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకోవడం కూడా చాలా అరుదు. కనీసం ఉన్నత స్థాయికి అయినా ఎదగాలని ప్రతి ఒక్క గురువు కోరుకుంటారు.

Written By: Suresh, Updated On : September 11, 2023 2:31 pm

Rajamouli- Sukumar

Follow us on

Rajamouli- Sukumar: ఏ రంగంలో అయినా ట్రైనింగ్ మస్ట్. నటీనటుల నుంచి మొదలు పెడితే.. డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్కరు కచ్చితమైన ప్లానింగ్ తో, ట్రైనింగ్ తోనే ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. సక్సెస్ సాధించాలి అంటే సక్సెస్ సాధించిన వారి వద్ద నుంచి మెలుకువలు, ట్రైనింగ్ అవసరం. దీన్ని చిత్ర పరిశ్రమ కూడా తూ.చా తప్పకుండా వాడుతుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరు తమదైన స్టైల్ లో సినిమాలు చిత్రీకరించడంలో దిట్ట. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరిని పోలుస్తూ ట్రోల్ చేస్తుంటారు ట్రోలర్స్.

ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువు అడుగుజాడల్లో నడవాల్సిందే. కానీ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకోవడం కూడా చాలా అరుదు. కనీసం ఉన్నత స్థాయికి అయినా ఎదగాలని ప్రతి ఒక్క గురువు కోరుకుంటారు. ఈ విషయంలో సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. తన స్కూల్ నుంచి వచ్చిన ఎంతో మంది డైరెక్టర్లు పేరు సంపాదించి మరిన్ని సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. కానీ ఈ విషయంలో రాజమౌళి మాత్రం ఒక అడుగు వెనకనే ఉన్నారు అని చెప్పాలి.

బాహుబలి సినిమా కు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇతర దేశాల అధ్యక్షులు కూడా మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడే విధంగా చేశారు. రీసెంట్ గా బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూలా డి స్వాలా ఆర్ఆర్ఆర్ సినిమాను కొనియాడారు. అంతేకాదు రాజమౌళి పేరు ప్రపంచ దేశాలలో మారుమోగుతుంది. కానీ తన శిష్యులు మాత్రం ఆ స్థాయిని అందుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. జక్కన్న వద్ద డైరెక్షన్ నేర్చుకుంటున్న వారు పెద్ద సక్సెస్ లను సాధించలేకపోయారు. కానీ సుకుమార్ స్టూడెంట్లు మాత్రం చిత్ర సీమలో దుమ్ముదులుపుతున్నారు.

ఉప్పెన సినిమా తెరకెక్కించిన బుచ్చిబాబు వంద కోట్ల డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. అంతేకాదు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్దమయ్యాడు. మరో వైపు దసర సినిమాతో శ్రీకాంత్ ఓదెల కూడా అదే రేంజ్ ను సంపాదించాడు. దసరా సినిమాతో నాని శ్రీకాంత్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినా.. ఎంట్రీ తోనే తన సత్తా చాటాడు ఈ డైరెక్టర్. కానీ దసరా సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు ఓదెల. ఈయనతో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు లైన్ కడుతున్నా.. ఎందుకో ఈ డైరెక్టర్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మరో వైపు స్టార్ హీరోలు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. యంగ్ హీరోలకంటే స్టార్ హీరోలతో సినిమా చేస్తారు కావచ్చు అనే టాక్ కూడా నడుస్తుంది. ఇప్పటికే కథ కూడా రెడీగా ఉన్నా.. యంగ్ హీరోలతో సినిమా తీయకపోవడంతో ఈ టాక్ మరింత ఎక్కువగా వినిపిస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెల ఏ హీరోను ఫైనల్ చేస్తారో చూడాలి.

మొత్తం మీద ఇలా ఒక్కో స్టెప్ పెంచుకుంటూ స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తూ హిట్లు పొందుతున్న డైరెక్టర్లుగా సుకుమార్ శిష్యులు పేరు సంపాదిస్తున్నారు. కానీ ఈ విషయంలో జక్కన్న మాత్రం ఒక అడుగు వెనకనే ఉన్నారట.