Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నా ఏపీ రాజకీయాల వల్ల కాస్త బ్రేక్ పడింది. కొన్ని షూటింగ్స్ కంప్లీట్ చేసుకొని మిగిలిన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవర్ స్టార్. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఒకటి. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమా అప్డేట్లు అభిమానులను సంతోష పెట్టాయి. కానీ సినిమాకు సంబంధించిన షూటింగ్ లేట్ అవడంతో మరింత నిరాశ చెందారు అభిమానులు.
ఎన్నికల వల్ల గ్యాప్ రావడంతో అసలు ఈ మధ్య షూటింగ్ ఉండదని.. ఎలక్షన్ల తర్వాతే ఓజీ అప్డేట్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ సడన్ గా షూటింగ్ మొదలుపెట్టి రెండు మూడు షెడ్యూల్లు కూడా కంప్లీట్ చేశారు మేకర్స్. అనుకోకుండా మళ్లీ మధ్యలో ఈ సినిమాకు బ్రేకు పడింది. దీంతో మూడు నెలలుగా ఎలాంటి షూటింగ్ జరగలేదు. దీంతో సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరటనిచ్చే మరో వార్త రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ అది మూడు రోజులు ముచ్చటగానే ఉండిపోయింది.
సినిమా చిత్రీకరణ కోసం పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చారు. దీంతో రెండు రోజుల ముందే చిత్రీకరణ మొదలుపెట్టారు మేకర్స్. కానీ ఒక్క రోజు షూట్ తర్వాత మరోసారి బ్రేక్ పడింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే విజయవాడ బయలుదేరి వెళ్లారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అల్యూమినియం ఫ్యాక్టరిలో షూటింగ్ జరుగుతుండగా బాబు అరెస్ట్ తెలిసిందట. దీంతో షూటింట్ స్పాట్ నుంచే పవన్ కళ్యాణ్ విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనుకొని ఈ సంఘటనకు చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా నిరాశ చెందారు. మరి మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అనే టెన్షన్ కూడా మొదలైందట.
కానీ కాస్త విరామం దొరికినా సినిమా షూటింగ్ కోసం ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఒకే సమయంలో రాజకీయాలు, సినిమాలకు తగిన న్యాయం చేస్తూ తనేంటో ఫ్రూవ్ చేసుకుంటున్నారు. విరామం లేకుండా కష్టపడే వ్యక్తికి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అని అభిమానుల సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.