God Concept Movies: రీసెంట్ గా దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఇవే…

నిఖిల్ కెరియర్ లోనే చాలా మంచి సినిమా గా గుర్తింపు పొందడమే కాకుండా ఆయన కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా గా కూడా నిలిచింది.

Written By: Suresh, Updated On : September 11, 2023 2:37 pm

God Concept Movies

Follow us on

God Concept Movies: ప్రస్తుతం దేవుడి మీద వచ్చే సినిమాలకి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్కువగా జనాలకి నచ్చుతున్నాయి కాబట్టి అలాంటి సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు వీటిమీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక గడిచిన రెండు సంవత్సరాలలో మొత్తం దేవుడి మీద వచ్చి మంచి విజయాలు సాధించిన సినిమాలు ఇవే…

ఈ లిస్ట్ లో మొదట గా చెప్పుకోవాల్సిన సినిమా కార్తికేయ 2 ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ ని అందుకుంది.ఇక ఈ సినిమా మొత్తం కృష్ణుడి కంకణం గురించి నడుస్తుంటుంది కాబట్టి ఈ సినిమా తెలుగులో కంటేకూడా హిందీ చాలా పెద్ద హిట్ అయింది నార్త్ ఆడియెన్స్ కి కృష్ష్ణుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈ సినిమాని చూసారు.అందుకే ఈ సినిమా మంచి హిట్ అయింది.ఇక ఈ సినిమా నిఖిల్ కెరియర్ లోనే చాలా మంచి సినిమా గా గుర్తింపు పొందడమే కాకుండా ఆయన కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా గా కూడా నిలిచింది.ఇక దానికి తోడు ఈ సినిమాతో పెద్ద పెద్ద హీరోలకు కూడా సాధ్యంకాని పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ ని ఈ సినిమాతో నిఖిల్ సాధించాడు అనే చెప్పాలి… ఇక ఈ సినిమా ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పటినుంచి నిఖిల్ కి బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ అయితే వస్తున్నాయి…ఇక ఈ సినిమాతో పాటు 2018 లో సుమంత్ హీరో గా వచ్చిన సుబ్రమణ్య పురం సినిమా కూడా కుమార స్వామి దేవుడి మీద నడిచే స్టోరీ కావడంతో ఈ సినిమాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సినిమాగా నిలిచింది…ఇక ఈ సినిమాతో మళ్లీ సుమంత్ ఒక మంచి హిట్ తన ఖాతా లో వేసుకున్నాడు…