https://oktelugu.com/

Pushpa: పుష్పలో ఆ సీన్​ను సుకుమార్​ నగ్నంగా చూపించాలనుకున్నాడట!

Pushpa: భారీ అంచనాల మధ్య డిసెంబరు 17న విడుదలైన పుష్ప… అంతే జోరుతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లోనూ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. విడుదలైన రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులు నెలకొల్పింది. మూడు రోజుల్లోనే రూ.173 కోట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 27, 2021 / 03:02 PM IST
    Follow us on

    Pushpa: భారీ అంచనాల మధ్య డిసెంబరు 17న విడుదలైన పుష్ప… అంతే జోరుతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లోనూ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. విడుదలైన రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులు నెలకొల్పింది. మూడు రోజుల్లోనే రూ.173 కోట్లు వసూళ్లు చేసింది.

    ఇప్పటికీ పలు చోట్ల వీక్ డేస్​లోనూ హౌస్​ ఫుల్ అవుతున్నాయి. కాగా, నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహాలో అన్​స్టాపబుల్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో తాజాగా, పుష్ప టీం సందడి చేసింది. ఈ ఎపిసోడ్​లో బన్నీ, రష్మికతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా పాల్గొన్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ షోలో పుష్ప ది రైజ్​ గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టారు సుకుమార్​. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప క్లైమాక్స్​లో బన్నీ, ఫహద్​ ఇద్దరూ.. బట్టలు విప్పి ఒకరిపై ఒకరు ఛాలెంజ్ విసురుకుంటారు.

    కాగా, ఆ సీన్​లో మొట సుక్కూ.. ఇద్దర్నీ నగ్నంగా చూపించాలని అనుకున్నారట.. కానీ, తెలుగు ప్రేక్షకులు అలాంటి సీన్​లకు ఎలా రియాక్ట్ అవుతారనే ఉద్దేశంతోనే అప్పటికప్పడు స్క్రిప్ట్​లో మార్పులు చేసినట్లు తెలిపారు. అయితే, పుష్ప 2లో మాత్రం ఇంతకుమించిన ఎలివేషన్లు ఉంటాయని తెలుస్తోంది.