https://oktelugu.com/

Pushpa 10days Collections: పదిరోజుల్లో ‘పుష్ప’కు వచ్చిందెంత?

Pushpa 10days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ను దర్శకుడు సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాడు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో రిలీజుకు ముందు ‘పుష్ప’ భారీగా బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ‘పుష్ప’ రూ.145కోట్ల మేర బిజినెస్ చేసి అదుర్స్ అనిపించింది. తొలి నాలుగు రోజులు కలెక్షన్లలో దుమ్ముదులిపిన ‘పుష్ప’ ఆ తర్వాత వెనుకబడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న రిలీజైన ‘పుష్ప’ అనుకున్నట్లుగానే తొలిరోజు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2021 / 02:43 PM IST
    Follow us on

    Pushpa 10days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ను దర్శకుడు సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాడు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో రిలీజుకు ముందు ‘పుష్ప’ భారీగా బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ‘పుష్ప’ రూ.145కోట్ల మేర బిజినెస్ చేసి అదుర్స్ అనిపించింది. తొలి నాలుగు రోజులు కలెక్షన్లలో దుమ్ముదులిపిన ‘పుష్ప’ ఆ తర్వాత వెనుకబడినట్లు తెలుస్తోంది.

    Pushpa Collections

    డిసెంబర్ 17న రిలీజైన ‘పుష్ప’ అనుకున్నట్లుగానే తొలిరోజు భారీగా కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమాకు డివైడ్ టాక్ రాగా ఆ వెంటనే వీకెండ్స్ కలిసి రావడం సినిమాకు ప్లస్ అయింది. తొలి మూడురోజులు ప్రేక్షకులు భారీగా థియేటర్లకు రావడంతో అనుకున్న దానికంటే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. ఎలాగోలా తొలివారం మంచి కలెక్షన్లు రాబట్టిన ‘పుష్ప’ ప్రస్తుతం రెండోవారంలో కొనసాగుతోంది.

    ఈక్రమంలోనే ‘పుష్ప’ మూవీ పదిరోజుల రన్ టైమ్ పూర్తి చేసుకుంది. దీంతో ‘పుష్ప’కు ఏమేరకు కలెక్షన్లు వచ్చాయి? ఇంకెంత వస్తే సినిమా సేఫ్ అయినట్లు అనే చర్చ అభిమానుల్లో నడుస్తుంది. ‘పుష్ప’ పదిరోజుల కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’కు పదిరోజుల్లో 131కోట్ల షేర్ వచ్చింది. ఈ చిత్రం సేఫ్ కావాలంటే ఇంకా 26కోట్లు కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప’ మూవీ పదిరోజుల్లో 76.46కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది. అయితే ఏపీలో టికెట్ల రేట్లు భారీగా తగ్గడంతో ఆ ప్రభావం సినిమాపై భారీగా పడినట్లు కన్పిస్తోంది. ఏపీలో ఆశించిన మేర వసూళ్ళు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ ఏరియాల్లో ఎగ్జిబ్యూటర్లు భారీగా నష్టపోయే అవకాశం కన్పిస్తోంది.

    ఏపీ మినహా తెలంగాణ, తమిళ, మలయాళం, హిందీల్లో ‘పుష్ప’ అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాబడుతోంది. హిందీలో ఈ మూవీ అనుకున్న దానికంటే ఎక్కువగానే కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబడుతున్న ‘పుష్ప’ సేఫ్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీలోని పరిస్థితులు ఇందుకు కలిసి రావడం లేదు.

    ఓవరాల్ గా పదిరోజుల్లో ‘పుష్ప’ కలెక్షన్లు చూస్తే నైజాంలో 36కోట్ల బిజినెస్ జరుగగా 37.31కోట్లు వచ్చాయి. అలాగే సీడెడ్లో 18కోట్లకు గాను 12.96కోట్లు, ఉత్తరాంధ్రలో 12.25కోట్లకు గాను 7.11కోట్లు, ఈస్ట్ లో 8కోట్లకు గాను 4.34 కోట్లు, వెస్ట్ లో 7కోట్లకు గాను 3.58 కోట్లు, గుంటూరులో 9కోట్లకు గాను 4.60 కోట్లు, కృష్ణాలో 7.5కోట్లకు గాను 3.77 కోట్లు, నెల్లూరులో 4కోట్లకు 2.79 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘పుష్ప’ 101.75కోట్ల బిజినెస్ చేయగా పదిరోజుల్లో 76.46కోట్లను రాబట్టింది. తమిళనాడులో 6కోట్లకు గాను 8.05 కోట్లు, కర్ణాటకలో 9కోట్లకుగాను 9.65 కోట్లు, హిందీలో 10కోట్లకు గాను 18.26 కోట్లు, ఓవర్సీస్ లో 13కోట్లకుగాను 12.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 1.15కోట్లకు గాను 2.12 కోట్లు, కేరళలో 4కోట్లకు గాను 4.15 కోట్లను సాధించింది.