https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 స్క్రీన్ ప్లే మార్పు పైన స్పందించిన సుకుమార్…అలా ఎలా చేశారో క్లారిటీ ఇచ్చాడా..?

సినిమా అనేది ప్రతి ఒక్కరికి కనీస అవసరంల మారిపోయింది. ఈ జనరేషన్ లో ఎవ్వరిని చూసినా సినిమాలని చూస్తూ కూర్చుంటున్నారు. బోరు కొట్టిన ప్రతిసారి ఏదో ఒక సినిమాని ఓపెన్ చేసి చూడడం. లేదంటే థియేటర్ కి వెళ్లి సినిమాలను చూడడం చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఓటిటి అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు చాలా ఎక్కువ సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ప్రేక్షకులు కూడా వాటిని చూసి ఎంటర్ టైన్ అవుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 10:49 AM IST

    Pushpa 2(2)

    Follow us on

    Pushpa 2: పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకులందరు ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్న సమయంలో సినిమా మేకర్స్ మాత్రం ఈ సినిమాని చాలా లైట్ వెయిట్ గా తీసుకున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రేక్షకుల ఎమోషన్ కి ఏ మాత్రం వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సినిమా డేట్ ని మారుస్తూ ప్రేక్షకులందరికి విసుగు పుట్టిస్తున్నారనే చెప్పాలి. ఇక ఎట్టకేలకు డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది అంటూ సినిమా మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి ఇప్పుడు ఆ డేట్ కి కూడా ఈ సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలైతే వెలువడుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు వాళ్ళు పోస్టర్స్ ద్వారా తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నప్పటికీ తీరా సమయం వచ్చేసరికి మాత్రం ఈ సినిమాను అనుకున్న డేట్ కి రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాల్లో కూడా సరైన క్లారిటీ లేకుండా పోతుంది.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ మరొకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సినిమా ఆర్డర్ ని ఒక్కసారి మార్చి చూస్తే స్క్రీన్ ప్లే ప్రకారం సినిమా చాలా బాగా వస్తుందట. మరి తను అనుకున్నట్టుగా తీస్తున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

    ఇక ఇది ఇలా ఉంటే స్క్రీన్ ప్లే అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి మరొక నాలుగు నుంచి ఐదు రోజులపాటు షూట్ చేయాల్సిన అవసరమైతే ఉంటుందంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా సుకుమార్ సినిమా అనేది చాలా వైల్డ్ గా ఉంటుంది. నిజానికి ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఫుటేజ్ ని తీస్తాడు. అందులో నుంచి చాలా సీన్లను కట్ చేసి చివరికి రెండున్నర నుంచి మూడు గంటల పాటు ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు.

    ఇక ఈ విషయం మీద కొంతమంది సినిమా మేధావులు సైతం స్పందిస్తూ అంత ఎక్కువ ఫుటేజ్ తీయడం ఎందుకు మళ్ళీ అందులో నుంచి సీన్లను తీసుకొని రెండున్నర గంటల పాటు సినిమా చేయడం ఎందుకు…ఆ ఎక్కువ ఫుటేజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి కొంతవరకు ఎక్కువ నష్టమైతే వస్తుంది కదా! అలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగానే మనకు ఏ సీన్లు కావాలి అనేది ఒక ప్రణాళిక బద్ధంగా రూపొందించుకుంటే మంచిది అని వాళ్ళు సుకుమార్ కు సలహాలను ఇస్తున్నారు…