https://oktelugu.com/

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ ను ఇంకా వేదిస్తున్న అనిమల్ సీన్స్… ఎందుకు జనాలు వాటిని రిసివ్ చేసుకోలేకపోతున్నారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు తమ కంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా ఎలాంటి జానర్ లో వస్తుందో మనం ఈజీగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఒక మార్క్ ని చూపించిన దర్శకులు ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా బిజీగా ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 10:54 AM IST

    Sandeep Reddy Vanga

    Follow us on

    Sandeep Reddy Vanga: సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా స్టాండర్డ్ ని ఒక్కసారిగా మార్చేసిన సందీప్ తనదైన రీతిలో ఇప్పుడు సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ లాంటి ఒక సూపర్ హిట్ కథని తెరమీదకి తీసుకొచ్చిన విధానం అద్భుతంగా ఉంది. అలాగే రణ్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్ ‘ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అనిమల్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మూవీ మీద ఏదో ఒక విమర్శలైతే వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన కొంతమంది నటులు కూడా ఆ సినిమా మీద విమర్శలు చేయడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక రీసెంట్ గా రన్బీర్ కపూర్ కూడా ఆనిమల్ సినిమా మీద స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశాడు. అనిమల్ సినిమా చాలా మంచి సినిమా అయినప్పటికీ కొంతమంది దానిని కావాలని విమర్శిస్తున్నారు.

    మా సినిమాలో నటించిన వల్లే ఆ సినిమాని విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు నటించడం ఎందుకు అంటూ సినిమా మీద సెటైర్లు వేసిన వాళ్లకి ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించాడు. ఇక ఇదిలా ఉంటే చాలామంది ట్విట్టర్ వేదికగా సందీప్ వంగ మీద కూడా కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా తన తదుపరి సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

    నిజానికి ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలు ఇంతకుముందు రాలేదా అంటే చాలా వచ్చాయి. కానీ ఒక తెలుగు దర్శకుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదగడం అనేది ఓర్చుకోలేకపోతున్న కొంతమంది బాలీవుడ్ మాఫియా గాళ్ళు ఇలా సందీప్ ని టార్గెట్ చేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

    అప్పటి నుంచి ఇప్పటివరకు అనిమల్ సినిమా మీద ఏదో ఒక విధంగా కామెంట్లు చేయడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందనే చెప్పాలి… చూడాలి మరి సందీప్ అనిమల్ సినిమా ను మించి మరొక సినిమాను చేసి సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…