Sukumar And Prabhas And Dil Raju: ‘రంగస్థలం’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, ఆ తర్వాత పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా మొత్తం మోతమోగిపోయే రేంజ్ క్రేజ్ ని అందుకున్న డైరెక్టర్ సుకుమార్, తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో చెయ్యడానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతం లో రామ్ చిత్రం తో ‘రంగస్థలం’ లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసిన సుకుమార్, ఇప్పుడు ఏ జానర్ లో రామ్ చరణ్ తో సినిమా తియ్యబోతున్నాడో అనేది ఆసక్తికరంగా మారిన అంశం. కథ రాయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకునే సుకుమార్, ఈ సినిమా కథ ని పూర్తి చేయడానికి ఇంకెన్ని రోజులు సమయం తీసుకుంటాడో చూడాలి. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ తో సినిమా పూర్తి అయ్యాక సుకుమార్(sukumar) ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి.
Also Read: మహేష్, రాజమౌళి #GlobeTrotter టైటిల్ సాంగ్ వచ్చేసింది.. కీరవాణి విశ్వరూపం మామూలుగా లేదు!
కొంతమంది పుష్ప 3 మొదలు పెడతాడని అన్నారు, మరికొంతమంది విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాడని అన్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్(Rebel Star Prabhas) తో చేయబోతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గానే ఓకే అయ్యినట్టు తెలుస్తుంది. కానీ సెట్స్ మీదకు వెళ్ళేది మాత్రం రామ్ చరణ్ తో సినిమా పూర్తి అయినా తర్వాతనే. సుకుమార్ తో పని చేస్తే చాలు, హీరోలో నటన ని బయటకు తీస్తాడు, వేరే లెవెల్ కి తీసుకెళ్తాడు అనే పేరుంది. ప్రభాస్ తన కెరీర్ మొత్తం మీద అద్భుతమైన నటుడు అని అనిపించుకునే రేంజ్ నటన ఇప్పటి వరకు చేయలేదు. సుకుమార్ తో చేస్తే ప్రభాస్ క్యాలిబర్ ని, ఆయన యాక్టింగ్ స్టామినా ని ఏ రేంజ్ లో ఉపయోగించుకుంటాడో మీరే ఊహించుకోండి. అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా లో ఖాన్స్ తో సమానమైన క్రేజ్ ని రప్పించే క్యారక్టర్ ని అందించాడు. ఇక ప్రభాస్ తో ఎలాంటి క్యారక్టర్ వెయ్యిస్తాడో చూడాలి.