Anupama Parameswaran: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా దారుణంగా తయారైంది. మొదటి నుండి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొంతమంది ఆకతాయిలు మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధిలోకి రావడం తో ఆకతాయిలు ఇష్టారాజ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కూడా ఇలాంటి బాధితురాలే. తమిళనాడు కి చెందిన 20 ఏళ్ళ యువతి తనకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా, తన కుటుంబాన్ని దూషిస్తూ అత్యంత నీచమైన పోస్టులు పెడుతోందని, ఇలాంటివి సోషల్ మీడియా లో సాధారణమే కదా అని మొదట్లో అసలు పట్టించుకోలేదని, దానిని అలుసుగా దీసుకొని ఈ యువతి మరింత దిగజారి, నా మార్ఫింగ్ ఫోటోలను నా కుటుంబ సబ్యులకు మాత్రమే కాకుండా, తన సహా నటులకు కూడా ట్యాగ్ చేస్తూ ప్రతీ రోజు టార్చర్ చేస్తుందని అనుపమ పరమేశ్వరన్ ఈ ఫిర్యాదు లో పేర్కొంది.
Also Read: అట్లీ ని చూసి భయపడుతున్న అల్లు అర్జున్..నిరాశలో ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!
అసలు ఎవరు ఈ అమ్మాయి అని తెలుసుకునే ప్రయత్నం చేశానని, కానీ ఆమె అనేక ఫేక్ అకౌంట్స్ ని మైంటైన్ చేస్తూ వస్తుందని, నేను ఇన్ స్టాగ్రామ్ లో ఏ చిన్న పోస్టు పెట్టినా ఫేక్ అకౌంట్స్ తో నాపై దుర్భాషలాడుతూ కామెంట్స్ చేస్తుందని,అందుకే నేను ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని కేరళ పోలీసులను ఆశ్రయించాను అంటూ మీడియా కి చెప్పుకొచ్చింది. అనుపమ పరమేశ్వరన్ లాంటి స్టార్ సెలబ్రిటీ కే ఇలాంటి పరిస్థితి వస్తే, ఇక సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటి?, అసలు ఈ సోషల్ మీడియా ని ఏ ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేదా?, ఇంతటి యంత్రాంగం ఉన్నది ఎందుకు?, అసలు జరుగుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది నుండి ఈ చేస్తున్న ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ గానే నిలుస్తూ వచ్చింది. ఈ ఏడాది ఆమె బైసన్, కిష్కిందపురి, ది పెట్ డిటెక్టివ్ వంటి చిత్రాలతో భారీ హిట్స్ ని అందుకుంది. ఈ ఏడాది లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించిన ‘పరదా’ అనే చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె కెరీర్ ఆశాజనకంగానే సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సినిమాలు చేయబోతుందో చూడాలి.