Sukumar : ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో (Nannaku Premitho) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు. కారణం ఏదైనా కూడా సుకుమార్ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథని సుకుమార్ ప్రస్తుతానికి పక్కన పెట్టారట. ఇక ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా కావడం విశేషం…
Also Read : సుకుమార్ పుష్ప సినిమా టైటిల్ పెట్టడం వెనక ఇంత కారణం ఉందా..?
ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు గ్యాంగ్ స్టర్ సినిమా అయితే చేయలేదు. కాబట్టి ఈ సినిమా కొత్తగా ఉంటుందని తన అభిమానులు సైతం అనుకుంటున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా పట్టలెక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కనక సెట్స్ మీదకి వెళ్తే భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ సైతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి వారు వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అందరూ ఫ్రీ అయిన తర్వాత ఈ సినిమా తెర మీదకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన ఇక మీద చేపట్టిన సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : సుకుమార్ ను ఫాలో అవుతున్న తన శిష్యులు…కారణం ఏంటంటే..?